సోషల్ మీడియా వచ్చిన తర్వాత హీరోయిన్లకు కాస్త ఎక్కువ క్రేజ్ పెరిగింది. ఆఫర్లు వస్తున్నాయి లేదు అనేది పక్కన పెడితే వాళ్ళు పోస్ట్ చేస్తున్న ఫోటోలు గాని వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు గానీ అన్నీ కూడా సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. వాళ్ళు పోస్ట్ చేస్తున్న ఫోటోలు సహా పెడుతున్న లైవ్ వీడియో లు అన్నీ కూడా ఇప్పుడు కుర్ర కారుకి హీట్ పెంచేస్తున్నాయి అనేది తెలిసిందే. ఆఫర్ల కోసమే వాళ్ళు ఈ విధంగా కష్టపడుతున్నా వాళ్లకు ఒక కొత్త సమస్య వచ్చి పడింది. 

 

అసలు ఆ సమస్య ఏంటీ అనేది ఒకసారి చూద్దాం. ఈ మధ్య సోషల్ మీడియాలో వాళ్లకు వస్తున్న కామెంట్స్ చూసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఫైర్ అవుతున్నారట. దిశా పటాని ఇలాగే ఇబ్బంది పడిపోయింది పాపం. ఒక సినిమా షూటింగ్ కి వెళ్ళగా ఆమెను గమనించిన ఫాన్స్ ఇబ్బంది పెట్టారు. సరే అది పక్కన పెడితే ఒక షాపింగ్ కి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెళ్ళింది ఈ హీరోయిన్. అప్పుడు కూడా ఇలాగే ఇబ్బంది పడింది. ఇక కింద వచ్చే కామెంట్స్ కూడా ఆమెకు చుక్కలు చూపిస్తున్నాయి. 

 

మీ ఫ్రెండ్ లక్కీ, మీరు హాట్, టూ హాట్, ఇంకొంచెం, ప్లీజ్ మోర్ ఫన్ అంటూ కొందరు పెడుతున్న కామెంట్స్ చూసి ఆమె బాయ్ ఫ్రెండ్ ఇబ్బంది పడుతున్నాడు. ఇక అలియా భట్ విషయంలో కూడా ఇలాగే జరిగింది అంటున్నారు సినీ జనం. ఆమె బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ ఆమెను అసలు సోషల్ మీడియా నే వాడకుండా ఉండాలని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఇలా హీరోయిన్లు ఆఫర్ల కోసం సోషల్ మీడియా కు వెళ్తే వాళ్ళ కొంపలో కుంపటి పెడుతుంది సోషల్ మీడియా.

మరింత సమాచారం తెలుసుకోండి: