టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి విదేశాల్లో సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ టూర్ ని ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఆ సినిమా మంచి సక్సెస్ ని అందుకోవడంతో పాటు మహేష్ బాబుకు వరుసగా మూడవ విజయాన్ని అందించింది. గతంలో భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న సూపర్ స్టార్, ఈ సినిమాతో హ్యాట్రిక్ పూర్తి చేసారు. ఇకపోతే మరొక నెల రోజుల్లో విదేశాల నుండి తిరిగి రానున్న మహేష్, వచ్చిన తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. 

 

గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన మహర్షి సినిమా సక్సెస్ కొట్టడంతో ఈ సినిమాపై అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు అటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం ఎంతో భారీగా అంచనాలు ఉన్నాయి. దిల్ రాజు, మహేష్ బాబు కలిసి నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. అయితే ఈ సినిమా విషయమై మహేష్ ఫ్యాన్స్ లో ఉన్న ఒక సందిగ్ధం మాత్రం తొలగడం లేదు. మహర్షి ఫస్ట్ హాఫ్ లో కాలేజ్ స్టూడెంట్ గా కొంత గడ్డంతో రఫ్ లుక్ లో దర్శనం ఇచ్చిన మహేష్, తదుపరి వంశీ దర్శకత్వంలో చేయబోయే ఆ సినిమాలో ఎటువంటి లుక్ లో కనపడనున్నారో అంటూ ఇప్పటికే నుండే ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. 

 

మాఫియా బ్యాక్ డ్రాప్ లో మంచి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక పాత్రలో మహేష్ ఎంతో క్లాస్ గా కనపడనుండగా, రెండవ రోల్ లో మాత్రం ఫుల్ మాస్ గా, కొద్దిపాటి గడ్డం, కొంత పెరిగిన క్రాఫ్ తో డిఫరెంట్ లుక్ లో దర్శనం ఇవ్వనున్నట్టు చెప్తున్నారు. మహేష్ కొత్త గడ్డం, క్రాఫ్ తో ఉన్న ఒక ఫోటో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్ లో చక్కర్లు  కొడుతుండడంతో, తదుపరి సినిమాలో మహేష్ లుక్ అదే కనుక అయితే బాగుంటుంది అంటూ ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా మహేష్ లుక్ అలానే రఫ్ గా డిఫరెంట్ గా ఉంటె మాత్రం ఇది నిజంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి పండుగ వార్త అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: