ఇప్పటి హీరోల్లో సహనం, ఓపిక, శక్తి సామర్థ్యాలు తక్కువనే చెప్పాలి. కొద్ది మంది హీరోలు మిన‌హా యూత్‌ హీరోలంతా సుతారంగానే వుంటున్నారు. అందుకే వారు హాయిగా హీరోయిన్లతో చెట్టాపట్టాలేసుకుని ఏడిపిస్తూ.. కాల‌క్షేపం చిత్రాల పై ఆసక్తి చూపుతుంటారు. ఆ కోవలోనే నితిన్‌ వున్నాడని చెప్పక తప్పదు. ఒకప్పుడు అగ్రహీరాలు ఏడాదికి 8నుంచి 10 చిత్రాలు చేసిన సందర్భాలున్నాయి. ఇక కమేడియన్లయితే రోజుకు మూడు షిఫ్ట్ లు  చేసి ఎనర్జిటిక్‌గా వున్నారు కూడా. కానీ హీరో నితిన్‌ వరుసగా మూడు సినిమాలు చేయాలంటే నా వ‌ల్ల‌ కాదు బాబోయంటూ చేతు లెత్తేశాడు.

 

ఈనె 21న భీష్మ వస్తోంది. ఈ చిత్రం చేస్తుండగానే వరుసగా రెండు సినిమాు చేస్తుండడం పై వ్యాఖ్యానిస్తూ... ‘భీష్మ’ చేసే టైంలోనే మరో రెండు సినిమాలూ చేస్తుంటే, క్యారెక్టర్స్‌ విషయంలో కన్‌ఫ్యూజ్‌ కాలేదు. ఎందుకంటే ఒక్కో డైరెక్టర్‌ది ఒక్కో శైలి. వెంకీ కుడుముకు డైలాగ్స్‌ చెప్పేటప్పుడు కళ్లార్పడం ఇష్టముండదు. అదే చంద్రశేఖర్‌ యేలేటిగారైతే, కళ్లు ఆర్పమంటాడు. ఎప్పుడైనా కాస్త కన్‌ఫ్యూజ్‌ అయినా ఆ డైరెక్టర్లే మళ్లీ తమ క్యారెక్టర్‌లోకి నన్ను తీసుకొచ్చేవాళ్లు. కానీ ఇంకెప్పుడూ లైఫ్‌లో ఒకేసారి మూడు సినిమాలు చెయ్యనండీ బాబూ.. నిద్ర లేదు, రెస్ట్‌ లేదు. ఎప్పుడైనా ఒకరోజు గ్యాప్‌ వస్తే, ఆ రోజు తమకు కావాని ముగ్గురూ కొట్టుకొనేవాళ్లు. ఇప్పుడు ‘భీష్మ’ అయిపోవడంతో కాస్త ప్రశాంతంగా ఉంది. యేలేటిగారితో చేస్తున్న సినిమా పేరు ‘చెక్‌’. చెస్తే ఆటలో ‘చెక్‌’ అనే మాట వస్తుంది కదా.. అదే’’ అంటూ తన చిత్ర అనుభవాన్ని వెల్ల‌డించాడు కథానాయకుడు నితిన్‌.

 

నేను 'శ్రీనివాస కల్యాణం' చేసేటప్పుడు డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ లైన్ చెప్పాడు. నాకు నచ్చింది. దాన్ని డెవలప్ చెయ్యడానికి సంవత్సరం టైం తీసుకున్నాడు. మునుపటి మూడు సినిమాలు ఆడలేదు కాబట్టి, ఈసారి స్క్రిప్ట్ పక్కాగా లాక్ చేసుకున్నాకే మొదలు పెడదామని అనుకున్నా. ఈ టైంలోనే 'రంగ్ దే' స్క్రిప్ట్, చంద్రశేఖర్ యేలేటి సినిమా స్క్రిప్ట్ కూడా విని ఓకే చేశాను. వాటి పూర్తి స్క్రిప్టులు అయ్యాకే మూడింటినీ మొదలు పెట్టాను. అలాగే కృష్ణచైతన్య చెప్పిన 'పవర్ పేట' స్క్రిప్ట్, హిందీ సినిమా 'అంధాధున్' రీమేక్ కూడా ఓకే ఛేశాను. ఈ ఏడాది బహుశా నావి నాలుగు సినిమాలు విడుదలవుతాయి. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి వెంకీ కుడుమ‌ల‌ దర్శకుడు. రష్మికా మందన్న నాయిక. ఈ నెల‌ 21న సినిమా విడుదల‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: