మాస్ కు ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది. బీసీ సెంటర్లకు నచ్చే కథ చేస్తే కెరీర్ కు ఢోకా ఉండదు అంటారు. అలాగే లవ్ స్టోరీస్ లో నటిస్తే యూత్ ఫాలోయింగ్ వస్తుందని చెబుతారు. కానీ ఈ రెండింటినీ ట్రై చేసిన అఖిల్ కు మాత్రం కష్టాలు తీరడం లేదు. అందుకే ఇప్పుడు ఫార్మాట్ మార్చేస్తున్నాడు. కొంచెం కొత్తగా ఆలోచించే దర్శకులతో జర్నీ చేయాలనుకుంటున్నాడు. 

 

వి.వి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ డైరెక్షన్ లో భారీ మాస్ యాక్షన్ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. భారీ బజ్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను అస్సలు ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ మాస్ స్టోరీ మెప్పించకపోవడంతో కొంచెం గ్యాప్ తీసుకొని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో హలో అనే తూనీగా ప్రేమకథలో నటించాడు. కానీ ఈ సినిమా కూడా అంచనాలు అందుకోలేకపోయింది.

 

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు రొమాంటిక్ స్టోరీస్ తో మంచి హిట్స్ వచ్చాయి. నాగచైతన్య కూడా రకరకాల ట్రై చేసి లవ్ స్టోరీస్ కు ఫిక్స్ అయ్యాడు. ఇక తమ్ముడు కూడా అన్నయ్యలాగే ప్రేమ అంటూ వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ఞుగా మారాడు. అయితే ఈ లవ్ కూడా అఖిల్ సక్సెస్ దాహాన్ని తీర్చలేకపోయింది. 

 

మాస్ తో కుదరలేదు. ప్రేమతో పని అవ్వలేదు. అందుకే ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా మారాడు. బొమ్మరిల్లు లాంటి సక్సెస్ కోసం భాస్కర్ తో ట్రావెల్ చేస్తున్నాడు. ఆ తర్వాత కొత్తకొత్త కథాంశాలు టచ్ చేసే సురేందర్ రెడ్డితో సినిమాలు చేయాలనుకుంటున్నాడు అఖిల్. మరి కొంచెం కొత్తగా వెళ్లాలనే ప్రయత్నం చేస్తోన్న అఖిల్, ఇప్పటికైనా ట్రాక్ ఎక్కుతాడా అనేది చూడాలి. మొత్తానికి అక్కినేని అఖిల్ కొత్త సినిమాలతో ఫ్యాన్స్ ను మాయచేయాలని చూస్తున్నాడు. ఎలాగైనా ఈ సారి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా అమ్మాయిల మనసు దోచేయాలని తెగ ట్రై చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: