వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ తాజా చిత్రం `నారప్ప`. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా సంచలనం సృష్టించిన `అసురన్‌` చిత్రానికి  రీమేక్‌ గా రూపొందుతున్న నారప్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  సురేష్‌ ప్రొడక్షన్స్‌, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు.

 

ప్రస్తుతం తమిళనాడు లో ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో నారప్ప కి సంబంధించి కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా.. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్  మాట్లాడుతూ `తమిళనాడులోని రెడ్ డెసర్ట్ లో 10 రోజులు తీసిన యాక్షన్ సీక్వెన్స్  చిత్రానికి హైలెట్ అవుతుంది. వెంకటేష్ గారికి, నాకు `నారప్ప` ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తోంది` అన్నారు.

 

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ, ` నారప్ప మోస్ట్ పవర్‌ ఫుల్, ఎమోషనల్ క్యారెక్టర్. ప్రేక్షకులు నారప్ప గా కొత్త వెంకటేష్ గారిని చూస్తారు` అన్నారు. కో- ప్రొడ్యూసర్ దేవి శ్రీదేవి సతీష్ మాట్లాడుతూ  `తమిళనాడులోని తిరిచందూర్ సమీపంలో ఉన్న తెరికాడు లో నారప్ప యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశాము. 12,000 ఎకరాల్లో ఉండే ఈ ప్రదేశాన్ని రెడ్ డెసర్ట్ ఆఫ్ తమిళనాడు అంటారు.  ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో నారప్ప కి సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేశాము` అని తెలిపారు.

 

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ విజయ్‌ శంకర్‌ దొంకాడ మాట్లాడుతూ  `ఇప్పటికే  27 రోజులు షూటింగ్ పూర్తి చేశాం. ఇంకా నాన్ స్టాప్ గా షెడ్యూల్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం` అన్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు శ్యామ్‌ కే నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: