టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ అనగానే చాలా మందికి గుర్తుకి వచ్చేది అతని యాటిట్యూడ్. వంద సినిమాలు చేసిన హీరో కూడా బాబు రేంజ్ లో షో చేయడు. దీనిపై సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు వస్తున్నా బాబు మాత్రం ఎక్కడా తగ్గేది లేదని అంటూ ఉంటాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే వేసవి తర్వాత ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది. అంత వరకు బాగానే ఉంది గాని బాబు విషయంలో ఇప్పుడు అతని అభిమానులు కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు.

 

అనవసరంగా అతి చేయవద్దని సూచిస్తున్నారు. సినిమాల్లో కాస్త అతి కూడా తగ్గించుకుంటే మంచిది అని సలహాలు కూడా ఇస్తున్నారు. ఈ నేపధ్యంలోనే తన సినిమా కథల విషయంలో విజయ్ ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక నుంచి సినిమాల్లో యూత్ ని రెచ్చగొట్టే విధం గా సీన్లు వద్దని చెప్తున్నాడని సమాచారం. ప్రస్తుతం పూరి తో చేస్తున్న ఫైటర్ సినిమాలో కొన్ని ముద్దు సీన్లు ఉన్నట్టు సమాచారం. దీనితో వాటిని కాస్త తీసేయలాని కోరినట్టు తెలుస్తుంది. 

 

ఇప్పుడు వాటిపై ఫ్యాన్స్ చిరాకు గా ఉన్నారని, అన్ని సినిమాలు అలా ఉంటే తనకు కష్టమని, ఇంకో రకంగా రోమాన్స్ చూడాలని అంతే గాని ఇలా ముద్దు సీన్లు మాత్రం అసలు వద్దని చెప్తున్నాడట ఈ హీరో. దీనితో పూరి కూడా మన వాడి బాధ అర్ధం చేసుకుని సరే వద్దులే బాధ పడకు అని చెప్పాడట. ఇటీవల క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా లో కూడా కాస్త అలాంటి సీన్లు ఉన్నాయి. దీనితో అతనిని తిట్టిన వాళ్ళే గాని తిట్టని వాళ్ళు లేరు. కాబట్టి బాబు జాగ్రత్తగా ఉంటున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: