వైఎస్సార్సీపీ సీఏఏకు అనుకూలంగా ఓటేసింది. క్షేత్ర స్థాయిలో ముస్లింల నుంచి విమర్శలు రావడంతో.. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు ఇచ్చేది లేదని వైఎస్సార్సీపీ ఎంపీలు జనవరి చివర్లో ప్రకటించారు. డిప్యూటీ సీఎం అంజద్ బాషా కూడా సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో సీఏఏకి చోటు లేదంటూ సీఎం జగన్ గతంలో ప్రకటించారు. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో జగన్ సందిగ్ధంలో ఉన్నారనిపిస్తోంది. 

 

 

కానీ.. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మొదట్నుంచి క్లారిటీతో కనిపిస్తున్నారు. కేసీఆర్ తొలి నుంచి సీఏఏకు వ్యతిరేక వైఖరిని తీసుకోగా.. పార్లమెంట్లో ఓటింగ్ సమయంలోనూ టీఆర్ఎస్ సీఏఏకు వ్యతిరేకంగా వ్యవహరించింది. సీఏఏను రద్దు చేయాలని ఇటీవలే తెలంగాణ కేబినెట్ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించాలని కూడా నిర్ణయించారు. ఇప్పటి వరకూ కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌ మాత్రమే సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశాయి. కేరళలో వామపక్షాలు అధికారంలో ఉండగా.. రాజస్థాన్, పంజాబ్‌లలో కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్‌ లో టీఎంసీ అధికారంలో ఉంది.                   

 

 

అయితే.. వైఎస్సార్సీపీ మాత్రం సీఏఏకు మొదట అనుకూలంగా ఓటేసింది. క్షేత్ర స్థాయిలో ముస్లింల నుంచి విమర్శలు రావడంతో.. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు ఇచ్చేది లేదని వైఎస్సార్సీపీ ఎంపీలు జనవరి చివర్లో ప్రకటించారు. డిప్యూటీ సీఎం అంజద్ బాషా కూడా సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో సీఏఏకి చోటు లేదంటూ సీఎం జగన్ గతంలో ప్రకటించారు.       

 

 

 అయితే.. మరోవైపు టీడీపీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు లోక్ సభలో సీఏఏకు అనుకూలంగా ఓటేయగా.. కేశినేని నాని ఓటింగ్‌ కు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సీఏఏ వ్యతిరేక సభల్లో పాల్గొంటున్నారు. బీజేపీకి దగ్గర కావాలని టీడీపీ కూడా భావిస్తోన్న వేళ.. చంద్రబాబు సీఏఏకు వ్యతిరేకంగా మాట్లాడగలరా అనే విషయం చూడాలి మరి...                                                

 

 

ఇదే అదనుగా తీసుకున్న టీడీపీ ఎంపీ కేశినేని నాని.. విజయవాడలో నిర్వహించిన సీఏఏ వ్యతిరేక ర్యాలీలో జగన్‌ కు సవాల్ విసిరారు. సీఏఏకు వ్యతిరేకంగా కేరళ తరహాలో సుప్రీంలో పిటిషన్ వేయాలని ఏపీ సీఎంకు సూచించారు. ఈ పని జగన్ చేయలేకపోతే.. తాను చేస్తానన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా జగన్ ఏపీ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెడితే.. టీడీపీలో ప్రస్తుతం ఉన్న 21 మంది ఎమ్మెల్యేలు కూడా తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తారని నాని తెలిపారు. ప్రజలకు హాని కలిగించే చట్టాలను తిరస్కరించాలని అసదుద్దీన్ ఒవైసీ జగన్‌ను కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: