మెగా అభిమానులు అందరికీ తమ అభిమాన హీరో లకు సంబంధించి ఏదైనా అప్ డేట్ వచ్చింది అంటే ఎంతో సంబరపడిపోతూ ఉంటారు. ఇక ఎప్పుడెప్పుడు తన అభిమాన హీరోల అప్డేట్ వస్తుందని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మెగా అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం రామ్ చరణ్ కు సంబంధించి లేదా మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇప్పట్లో రాలేదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కొరటాల శివ ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కథ గురించి వార్తల్లో ప్రచురితం కావడం లేదు కానీ ఇప్పటివరకు చిత్రబృందం మాత్రం ఎలాంటి సమాచారం తెలుపలేదు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి ఇలాంటి అప్ డేట్ కూడా రాలేదు. 

 


 ఇక ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్  సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో  కలిసి మాత్రం మల్టీస్టారర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వరకు జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు కానీ రామ్ చరణ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మాత్రం విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల అప్డేట్ల కోసం మెగా అభిమానులు అందరూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే మెగా అభిమానుల నిరీక్షణ త్వరలో తీరనున్నట్లు తెలుస్తోంది. మెగా హీరోలకు సంబంధించిన అప్డేట్ త్వరలో రాబోతున్నట్లు సమాచారం. 

 

 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27వ తేదీన 35వ వడి లోకి అడుగుపెడుతున్న సందర్భంగా... మెగా పవర్ స్టార్ బర్త్ డే రోజు అభిమానులందరికీ రెండు సర్ ప్రైస్ లు ఉండే అవకాశం ఉందని ప్రస్తుతం సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే రోజున ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని రామ్ చరణ్ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. అంతే కాకుండా తాజాగా మరో న్యూస్ కూడా వైరల్ అవుతుంది. చిరు కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సహా ఫస్ట్ లుక్  కూడా అదే రోజు విడుదల కాబోతుందని సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే మెగా అభిమానులకు పండగే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: