గత ఏడాది డియర్ కామ్రేడ్  తో డిజాస్టర్ ను చవిచూసిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ తో మరో డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. డియర్ కామ్రేడ్ ఓపెనింగ్స్ అయినా రాబట్టి విజయ్ క్రేజ్ ఏంటో చూపించింది కానీ ఫేమస్ లవర్ మాత్రం విజయ్ ను అమాంతం పాతాళానికి పడేసింది. ఓపెనింగ్స్ కాదు కదా 5రోజుల్లో ఈ చిత్రంబాక్సాఫీస్ వద్ద వాష్ అవుట్ అయ్యింది. ప్రస్తుతం అన్ని ఏరియాల్లో డెఫిసిటీ తో నడుస్తుంది ఈ చిత్రం.
 
ఇక ఈ సినిమా కు వస్తున్న రెస్పాన్స్ చూసి విజయ్ కూడా చేతులెత్తేశాడు. ప్రమోషన్స్ ను కూడా చేయకుండా తన తదుపరి చిత్రం ఫైటర్(వర్కింగ్ టైటిల్ )తో బిజీ అయ్యాడు. ఈచిత్రం విజయ్ కెరీర్ ను డిసైడ్ చేయనుంది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి డైరెక్టర్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు వున్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ముంబై లో జరుగుతుంది. ఇక రేపు ఈ సినిమా నుండి ఓ ఆసక్తికర అప్డేట్  రానుందని సమాచారం. రేపు ఉదయం 10గంటలకు ఈఅప్డేట్ ను రివీల్ చేయనున్నారు.
 
 
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో రమ్యకృష్ణ అలాగే బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్  కీలక పాత్రల్లో నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే అనన్య పేరును ఇంతవరకు మేకర్స్ అధికారకంగా ప్రకటించలేదు. బహుశా రేపు హీరోయిన్ తోపాటు సినిమా టైటిల్ ను కూడా ప్రకటిస్తారో చూడాలి. పూరి ,ఛార్మి తో కలిసి స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దాంతో ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా విడుదలకానుంది. మే చివర్లో ఈ సినిమాను ప్రేక్షకులముందుకు  తీసుకురానున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: