కొందరు హీరోయిన్స్‌కు పట్టిన అదృష్టాన్ని చూస్తే అసూయ కలుగుతుంది.. అలాంటి వారిలో సమంత ఒకరని చెప్పవచ్చూ.. ఎందుకంటే అక్కినేని వారి ఇంటి కోడలుగా అడుగుపెట్టిన సమంత అనుభవించే లైఫ్ చాలమంది హీరోయిన్స్‌కు జలసిగా అనిపించవచ్చూ. ఇక సమంత నటించిన టాలీవుడ్‌లో మొదటి సినిమా  ‘ఏం మాయ చేసావే’ ఈ సినిమాతో టాలీవుడ్‌లో జెస్సీగా అడుగుపెట్టిన సమంత.. ఈ సినిమాలో హీరోగా నటించిన అక్కినేని నటవారసుడు నాగచైతన్యను ఏం మాయచేసిందో తెలియదు గాని, తొలిచూపులోనే ప్రేమలో పడిపోయింది.

 

 

ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి ‘మనం’, ‘ఆటో నగర్ సూర్య’ సినిమాల్లో కలిసి నటించారు. ఇకపోతే ఆటోనగర్ సూర్య సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందట... ఇక పెళ్లి తర్వాత సమంత సినిమాల్లో మరింత వేగం పెంచింది. దీంతో  ఆమె క్రేజ్ కూడా మరింత పెరిగింది. చైతు విషయానికి వస్తే, పర్వాలేదని అనిపిస్తున్నాడు. ఇదిలా ఉండగా వీరిద్దరూ ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకున్నారట.. అందులో భాగంగా అత్యంత ఖరీదైన కారుని గతంలో చైతూకి, బహుమతిగా ఇచ్చిందట సమంత.

 

 

అంతేకాదు ఎన్నో బైక్స్ ,కారులు కూడా ఇచ్చిందట. ఎందుకంటే చైతూకి బైక్స్ తో పాటుగా, కార్లు అంటే చాలా ఇష్టమట.. ఇకపోతే 2017 జనవరి 29న నిశ్చితార్ధం చేసుకున్న వీళ్ళు 2017 అక్టోబర్ 17న పెళ్లి చేసుకున్నారు. ఈ నిశ్చితార్ధం తరువాత కూడా సమంత, చైతుకి ఎఫ్4 బైక్ ని కొనిచ్చింది. ఈ బైక్ షోరూం ధర 27లక్షలు. తాజాగా కోటిన్నర పెట్టి డి ఎం డబ్ల్యు కారు సెవెన్ సిరీస్ కొనిచ్చిందట. పెట్రోలు, డీజిల్ అప్షన్స్ తో నడిచే ఈ కారు ధర, టాక్స్, రిజిస్ట్రేషన్ తో కలిపి కోటిన్నర దాటిపోతుంది. అంతే కాకుండా దీని నెంబర్ కోసం నాలుగున్నర లక్షలు ఖర్చుచేసాడట.

 

 

సేం ఇలాంటి కారు నాగార్జున తన 57వ పుట్టినరోజు సందర్బంగా కొన్నాడట. దీంతో అక్కినేని ఫ్యామిలీ దగ్గర ప్రస్తుతం ఇలాంటి  కార్లు రెండు ఉండగా, చైతు, సమంత ఇప్పటికే మరో మూడు లగ్జరీ కార్స్ వాడుతున్నారు. వీటి ఖరీదు 62లక్షలు, 70లక్షలు, ఒక కోటి 15లక్షలు విలువ కల్గిన కార్లవి. ఇవేగాక ఉమ్మడి ఫామిలీ గా ఉండే అక్కినేని కుటుంబంలో ఇలాంటివి చాలా కార్లు ఉన్నాయట...

మరింత సమాచారం తెలుసుకోండి: