మెగాస్టార్ చిరంజీవి.. ఇతని గురించి ఎం అని చెప్తం? ఎంత అని చెప్తం ? పునాదిరాళ్లతో పునాది వేసుకొని.. స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి.. ఈయన ఎంట్రీతో తెలుగు సినిమా రూపురేఖలే మారిపోయాయి.. తెలుగు సినిమా ఓ స్టేజికి వచ్చింది.. అప్పటివరకు సినిమా అంటేనే దేవుళ్ళు.. ప్రేమలు.. కుటుంబం అనుకుంటున్న రోజుల్లో ఈయన సినిమాల్లో కొత్తదనం కనిపించింది. 

 

ఆ కొత్తదనమే ఇప్పటికి కనిపిస్తుంది.. ఈయన సినిమా దర్శకుడు.. రచయత కాకపోయినా.. నటుడే అయినా.. సినిమా కథలు ఎంచుకోవడంలో ఓ రేంజ్ ఉంది. ఇకపోతే.. ఒక్క చిరంజీవికి మాత్రమే సొంతం ఈ క్రేజ్.. ఎందుకు అంటారా? దాదాపు 30 ఏళ్ళు అలుపెరగకుండా సినిమాలు తీసిన చిరు.. దాదాపు 10 సంవత్సరాలు సినిమాలు తియ్యలేదు..                 

 

అలా అన్ని సంవత్సరాలు తియ్యకపోయిన సరే ఆయనకు ఉన్న క్రేజ్ మరెవరికి లేదు. ఇకపోతే.. చిరంజీవి ఇన్నాళ్ళకు సినిమాలకు వచ్చాడు.. ఈ 10 సంవత్సరాల్లో తమ్ముడు పవర్ స్టార్ అయ్యాడు.. కొడుకు మెగా పవర్ స్టార్ అయ్యాడు.. మెగా ఫ్యామిలీకి రేంజ్ డబల్ అయ్యింది..                

 

అయితే అందరూ మెగా అభిమానులు అంత కూడా చిరంజీవి.. రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ సినిమా రావాలి అని కోరుకుంటున్నారు. కానీ నిజానికి మెగా అభిమానులు అంత కూడా చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్ కాదు.. చిరంజీవి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ను కోరుకుంటున్నారు.. అప్పుడెప్పుడో శంకర్ దాదా జిందాబాద్ లో పవన్ కళ్యాణ్ చిన్న క్యారెక్టర్ చేశాడు.. అయితే ఇప్పుడు మెగా అభిమానులు అదే కోరికను కోరుకుంటున్నారు. చిరు పవన్ సినిమా ఒకటి కావాలి అని.. మరి అభిమానుల కోరిక ఎంత మాత్రం తీరుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: