మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు.. తెలుగు ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసిన చరిత్రమెగాస్టార్ కే సొంతం. అలాంటి మెగా స్టార్.. ఈ స్టేజికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు.. ఏలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. సినిమాలు తీసి స్వయంకృషితో ఎదిగిన స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది మెగాస్టార్ ఏ. 

 

అలాంటి మెగాస్టార్ ఎవరు గ్రీన్ హీరోయిన్ ఎవరో తెలుసా? అంత అద్భుతమైన నటి ఎవరో తెలుసా? ఇంకెవరు.. లేడీ అమితాబ్ విజయశాంతినే. ఈమెతో కలిసి చిరు తీసిన ప్రతి చిత్రం సూపర్ హిట్ అయ్యింది. మాములు సూపర్ హిట్ కాదు.. ఆ సినిమాలు ఇప్పుడు చుసిన ఇంకా ఇంకా చూడాలి అనిపించే సినిమాలు అవి.. 

 

అంత అద్భుతమైన సినిమాలు ఏంటి అనుకుంటున్నారా?... చిరంజీవి.. విజయశాంతి కలిసి ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా? చిరంజీవి, విజయశాంతి కలిసి దాదాపు 19సినిమాలలో నటించారు.. సంఘర్షణ, దేవాంతకుడు, మహానగరంలో మాయగాడు, చాలెంజ్, చిరంజీవి, కొండవీటి రాజా, ధైర్యవంతుడు, చాణక్య శపథం, పసివాడి ప్రాణం, స్వయంకృషి, మంచి దొంగ, యముడికి మొగుడు, యుద్ధభూమి, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, రుద్రనేత్ర, కొండవీటి దొంగ, స్టూవర్ట్‌పురం పోలీస్‌స్టేషన్, గ్యాంగ్ లీడర్, మెకానిక్ అల్లుడు వంటి 19 చిత్రలలో కలిసి నటించారు. అయితే ఈ సినిమాలలో ఎవరో రెండు మూడు అట్టర్ ప్లాప్ అయినా.. మిగితా అన్ని సినిమాలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. దీంతో అప్పట్లో అందరూ వీళ్ళ పెయిర్ ని హిట్ పెయిర్ అనేవాళ్లట

 

ఇన్ని సూపర్ హిట్ చిత్రాలు ఈ పెయిర్ కే సొంతం అయ్యాయి. ఇంకా మొన్న సరిలేరు నీకెవ్వరూ సినిమా ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి విజయశాంతితో కలిసి చేసిన అల్లరి అంత ఇంత కాదు.. అందరి చూపు ఈ ఓల్డ్ జంటపైనే పడింది. ఎందుకంటే.. వయసు వచ్చిన సరే.. ఓల్డ్ జంట చూడటానికి ఎంతో అందంగా కనిపించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: