తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తరువాత ఆ స్థాయిలో అభిమానించదగ్గ నటుడు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి ఎంతో కష్టపడి.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్వయం కృషితో తనకంటూ ఓ రేంజ్ ను సొంతం చేసుకున్నాడు. అప్పట్లో నాగేశ్వర్ రావు.. ఎన్టీఆర్ ఏ స్వయం కృషితో ఎదిగారు అనుకుంటే.. 

 

అంత వారసత్వం హీరోయిజం నడుస్తున్న సమయంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి అడుగడుగున కష్టపడి పైకి ఎదిగాడు మెగాస్టార్. ఇకపోతే మెగాస్టార్ విలన్ గా ఎంట్రీ ఇచ్చిన సరే.. హీరోగా సినిమా తీసి తను అనుకున్న దానికంటే ఎక్కువే సంపాదించాడు. అనుకున్నవి అన్ని సాధించాడు.. కానీ ఒక్కదానిలో మాత్రం ఘోరాతి ఘోరంగా విఫలమయ్యాడు. 

 

అది ఏంటి అనుకుంటున్నారా? రాజకీయం. సినిమాలో హీరోగా అయితే ఎదిగాడు కానీ.. రాజకీయాలలో మాత్రం జీరో అయ్యాడు.. ఎంతోమంది అభిమానులు ఉన్న సరే.. ఎందరో జై కొట్టిన సరే.. రాజకీయంగా మాత్రం చిరంజీవి ఎదగలేకపోయాడు.. అప్పట్లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ఏలినట్టు ఏలలేకపోయాడు..                 

 

హా.. అటు ఎంజీఆర్, జయ లలిత.. ఇటు ఎన్టీఆర్.. అందరూ రాజకీయాల్లో తళుక్కుమని మెరిసి ప్రజల్లోకి చేరినట్టు నేను చేరలేనా? అని చిరంజీవి అనుకున్నాడో ఏమో.. నిజంగానే ప్రజల్లోకి చేరలేకపోయాడు. ఘోరాతి ఘోరంగా ఓటమిని చవి చూశాడు.. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలకు చిరంజీవి బయటకు వచ్చాడు..                 

 

అలా వచ్చిన చిరంజీవి నాలుగు సంవత్సరాలకు గాను 2 సినిమాలు తీశాడు. ఇక ఇప్పుడు మళ్ళి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.. అన్నకు రాజకీయాలు అచ్చురాలేదు.. అలానే తమ్ముడు అయినా పవన్ కళ్యాణ్ కు కూడా రాజకీయాలు అచ్చురాలేదు. మరి చిరు రాజకీయాల్లో రీఎంట్రీ అయినా అయన కలను నెరవేరుస్తుంది ఏమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: