విల‌క్ష‌ణ‌ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ న‌టిస్తున్న తాజా చిత్రం `భార‌తీయుడు 2`. ఈ చిత్రం త‌మిళంలో `ఇండియ‌న్ 2` పేరుతో శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందితున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ చెన్నైలోని బిన్నీ మిల్స్‌లో జ‌రుగుతోంది.  షూటింగ్ స్పాట్‌లో విషాదం నెల‌కొనింది. అనుకోకుండా భారీ క్రేన్ కింద‌ప‌డి చాలా మందికి గాయాల‌య్యాయి. స్పాట్‌లో ముగ్గురు అసిస్టెంట్ డైరెక్ట‌ర్లు చ‌నిపోయారని స‌మాచారం. అంతే కాక ద‌ర్శ‌కుడు శంక‌ర్‌కు కూడా తీవ్ర గాయాల‌యిన‌ట్లు స‌మాచారం. అయితే ఆయ‌న కాలు కూడా ఫ్రాక్చ‌ర్ అయింద‌ని అంటున్నార‌ట‌. శంక‌ర్ కి గాయాల‌వ్వ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆయ‌న లైటింగ్ సెట‌ప్‌కి చాలా ద‌గ్గ‌ర‌గా ఉన్నార‌ని చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు.  అతి పెద్ద భారీ లైట్‌ని క్రేన్‌కి తాడుతో వ్రేలాడ‌దీయ‌గా అది భూమికి స‌రిగ్గా 150 అడుగుల దూరంలో ఉంది. క్రేన్‌కి క‌ట్టిన తాడు లూజ్ అవ్వ‌డంతో ఈ ప్ర‌మాదం నెల‌కొనింద‌ని అక్క‌డ ఉన్న చిత్ర యూనిట్ చెబుతున్నారు. 

 


శంకర్ శరీరానికి బాగా గాయాలయ్యాయి, అలానే కాలు కూడా విరిగినట్లు చెప్తున్నారు. దానివలన చాలా వరకు రక్తం పోయిందని, అందువలన ఆయనను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్న ప్రత్యేక వైద్య సిబ్బంది, మరొక 24 గంటల వరకు ఆయనను అబీజర్వేషన్ లో ఉంచాలన్నారు, దానితో ఒక్కసారిగా కోలీవుడ్ సినిమా పరిశ్రమలో తీవ్ర ఆందోళన లో ఉంది. ఇక ఆయన అభిమానులు అయితే శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు కూడా చేస్తూ పలు సోషల్ మీడియా మధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. 

 

  ఇక ఈ చిత్రాన్నిలైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై సుభాస్క‌ర‌న్ అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్‌ప్రీత్‌సింగ్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 1996లో ఏ.ఎం. ర‌త్నం నిర్మించిన ఈ చిత్రం అప్ప‌ట్లో దాదాపు అన్ని భాష‌ల్లో  తెలుగు, త‌మిళ‌, హిందీ సంచ‌ల‌నం సృష్టించింది.  ఈ చిత్రం క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. దీనికి సీక్వెల్‌గా వ‌స్తున్న `భార‌తీయుడు 2` 
ఇప్ప‌టికే చెన్నై, హైద‌రాబాద్‌, రాజ‌స్థాన్‌లోని కీల‌క ప్ర‌దేశాల్లో సీన్స్‌ని షూట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: