సౌత్ అండ్ నార్త్ లో బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. హిందీ, తమిళం, తెలుగు లో ఈ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సీజన్ 13 తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కోలీవుడ్ లో కమల్ హాసన్ బిగ్ బాస్ కూడా సూపర్బ్ గా సక్సస్ అయింది. ఇక మన టాలీవుడ్ కి వచ్చేసరికి మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అదరగొట్టాడు. హోస్ట్ గా చేసింది మొదటిసారైనా కూడా తారక్ బిగ్ బాస్ ని ఒక లెవల్ కి తీసుకు వెళ్ళాడు. వీకెండ్స్ లో వచ్చే తారక్ కోసం ప్రేక్షకులు పడిగాపులు కాసే వాళ్ళు. అలాగే తారక్ కూడా ప్రేక్షకులను టీవీ ల ముందు నుంచి కదలనీయకుండా ఫుల్ గా ఎంటర్‌టైన్ చేశాడు.

 

ఇక సీజన్ 2 కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. షో ని సక్సస్ చేయగలిగాడు కాని తారక్ రేంజ్ లో మాత్రం ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాడు. ఇవే మాటలు, విమర్శలు బయట కూడా బాగా వినిపించాయి. ఏదేమైనా నానీ కూడా ఒక పెద్ద రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరించి క్రేజ్ మాత్రం దక్కించుకున్నాడు. అయితే ఈ రెండు షోస్ లో కాంట్రవర్సీలు బాగా తక్కువేనని చెప్పాలి. అంతే కాదు బిగ్ బాస్ సీజన్ 1, 2 లలో పాపులర్ అయినవాళ్ళు కూడా తక్కువే.

 

కానీ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3 మాత్రం ఆద్యంతం ఉత్కంఠతను రేపింది. మొదలైన మొదటివారం నుంచే రక రకాల గాసిప్స్ రూమర్స్ తో నిత్యం హాట్ టాప్ గా మారింది. అంతేకాదు కొంతమంది షోలో పాల్గొనాలంటే కమిట్‌మెంట్ ఇవ్వాలన్న ప్రతిపాదనా ఉందని నిర్వాహకుల మీద ఆరోపణలు చేశారు. ఇదంతా ఒకెత్తైతే షో ముగిసే సమయానికి విన్నర్ ఎవరన్న దానిమీద జనాలలో రోజు రోజుకి వాడి వేడి చర్చ జరిగింది. సీజన్ కంప్లీటయ్యో సమయానికి రేస్ లో శ్రీ ముఖి, జ్యోతి, వరుణ్ సందేశ్ దంపతులు, బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారు. 

 

అయితే అందరూ టైటిల్ శ్రీ ముఖి దే అని గట్టిగా ఫిక్సైయ్యారు. వాస్తవంగా కూడా తనకే రావాలన్న టాక్ కూడా బాగా వినిపించింది. ఒకవేళ శ్రీ ముఖి కాకపోతే వరుణ్ సందేశ్ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ టైటిల్ రాహుల్ సిప్లిగంజ్ కి కట్టబెట్టారు. కానీ ఇది ఎవరు జీర్ణించుకోలేకపోయారు. అయితే ఇన్నాళ్ళకు టాప్ సీక్రెట్ రాహుల్ కి టైటిల్ దక్కడానికి పునర్నవి ఏవో వ్యవహారాలు నడిపిందని తెలుస్తోంది. లోలోపల పున్నూ చేసిన మ్యాజిక్క్స్ వల్లే రాహుల్ టైటిల్ గెలుచుకున్నాడని ఇది దారుణమని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో ఎంత వాస్తవమున్నా ఇప్పుడు చేయగలిగిందేమి లేదు కదా ...పాపం శ్రీ ముఖి.

మరింత సమాచారం తెలుసుకోండి: