'నేను చచ్చిపోతే నువ్వేడుస్తావో లేదో గాని నువ్వేడిస్తే నేను చచ్చిపోతా' ..సుడిగాలి సుధీర్ రష్మీ తో ఎప్పుడు చెప్పే డైలాగ్. పాపం ఇప్పుడదే సుధీర్ కి పర్మనెంట్ డైలాగ్ అవుందంటున్నారు. అవును ఇన్నాళ్ళు ఢీ షో తోపాటు ఎక్స్‌ట్రా జబర్ధస్త్ షోలో సుధీర్ రష్మీ మీద చాలా ప్రేమని చూపిస్తూ వస్తున్నాడు. ఇద్దరి మధ్య నిజంగా ఏదో ఉందనే అందరూ అనుకుంటున్నారు. అంతేకాదు ఎప్పుడో కప్పుడు సుధీర్ రష్మీ పెళ్ళి చేసుకోవడం ఖాయమని అందరూ గట్టిగా ఫిక్సై ఉన్నారు. ఇక నిజంగా వీళ్ళిద్దరు పెళ్ళి చేసుకుంటే బావుంటుందని చాలామంది ముచ్చటపడుతున్నారు కూడా. 

 

రష్మీ షోస్ మాత్రమే కాకుండా గుంటూర్ టాకీస్ సినిమా తో పాటు మరికొన్ని సినిమాలలోను హీరోయిన్ గా నటించింది. యాక్ట్రెస్ గా మంచి పేరున్న సంగతి తెలిసిందే. మంచి అవకాశాలు పడాలేగాని రష్మీ టాలీవుడ్ లో మంచి హీరోయిన్ గా సెటిల్ అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందం అభినయం రెండిటిల్లోను రష్మీ బాగా ఆకట్టుకుంటుంది. ఇక షోస్ విషయంలోనూ రష్మీ ఇన్నేళ్ళుగా ప్రేక్షకులను ఎంటెర్టైన్ చేస్తుండటం, సుమ తర్వాత రష్మీకి అంతటి క్రేజ్ ఉండటం గొప్ప విషయం. ముఖ్యంగా ఢీ షోలో రష్మీ సుధీర్ ల రొమాన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతుంటారు. అదే నిజంగా వీళ్ళు పెళ్ళి చేసుకుంటే బావుంటుందన్న ఆలోచన వచ్చేలా చేసింది. అయితే మా ఇద్దరి మధ్య అలాంటిది ఏమీలేదని మేము షో కోసమే అలా నటిస్తాము తప్ప అందులో ఎంతమాత్రం వాస్తవం లేదని రిటీ ఇచ్చారు. అయినప్పటికి జనాలకి మాత్రం అది నమ్మాలనిపించడం లేదు.

 

ఇదిలా ఉంటే తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే యాంకర్ ప్రదీప్ రష్మీ పెళ్ళి చేసుకోబోతున్నారని. ఢీ లో బాగా ఫేమస్ అయిన యాంకర్ ప్రదీప్ ... అటు రష్మీ ని ఇటు సుధీర్ ని బాగా ఆటపట్టిస్తూ షో ని ఒక లేవల్ కి తీసుకు వచ్చాడు. అంతేకాదు కొన్ని స్కిట్స్ లో రష్మీ తో రొమాంటిక్ గాను మూవ్ అవుతాడు ప్రదీప్. ఇక ఈ జంట చూడటానికి కూడా చక్కగా ఉంటుంది. అదే కారణమో ఏమో గాని గత కొన్ని రోజులుగా ప్రదీప్ రష్మీల పెళ్ళి గురించి హాట్ టాపిక్ అవుతూ వైరల్ అవుతోంది. సమ్మర్ పెళ్ళికి సంబంధించిన ఇన్విటేషన్ కూడా రెడీ అవుతోందని ఇదంతా చాలా సైలెంట్ గా జరుగుతుందని మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో ఎంతవరకూ నిజముందో గాని దీనిపై ప్రదీప్ లేదా రష్మీ స్పందిస్తే జనాలకి ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ అదే నిజమైతే సుధీర్ అంతే. 

మరింత సమాచారం తెలుసుకోండి: