సినిమా పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడికి ఒకసారి అవకాశాల కోసం వచ్చాక, కొద్దిపాటి కష్టాలు తప్పవు. వెనుక పెద్ద వారి సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా మన కష్టం మనం పడాల్సిందే, అలానే మన టాలెంట్ ని మనం నిరూపించుకోవాల్సిందే. అయితే సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా రెండూ కూడా చెప్పి రావు. అయితే ఒక సారి మనకు వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుని మన టాలెంట్ తో ముందు సాగితే ఒకింత మెల్లగా అయినా సక్సెస్ వచ్చి తీరుతుందని కొందరు నటీనటులు అంటూ ఉంటారు. అయితే సక్సెస్ కు ఒక కొలమానం లేదని, కానీ అది వచ్చిన తరువాత మాత్రం నిలబెట్టుకోకపోతే ఎంతో ఇబ్బందని అనేది కూడా నిజమే. ఇక హీరోయిన్లు గా వస్తున్న వారి పరిస్థితి ప్రస్తుతం మరింత దయనీయం అనే చెప్పాలి. ఎందుకంటే, ఒకసారి హీరోయిన్ గా వచ్చిన తరువాత మంచి సక్సెస్ వస్తే ఓకే, లేదంటే అటువంటి వారిని పూర్తిగా ప్రక్కన పెట్టి వేరొకరిని ఏ మాత్రం సంకోచించకుండా తీసుకుంటున్నారు. 

 

ఇక సక్సెస్ వచ్చినప్పటికీ కూడా అది ఒకప్పటి వలే వారికి వరుసగా సినిమా అవకాశాలను ఇవ్వడం లేదు. ఏదో ఆ సక్సెస్ తో కొన్ని సినిమాలు చేయగానే, ఈ మధ్యలోనే మరికొందరు కొత్త హీరోయిన్ల రాకతో వారిని ప్రక్కన పెట్టేయడం ప్రస్తుతం దర్శక నిర్మాతలకు చాలా కామన్ అయిపొయింది. ఇక ఆ విధంగా ఎన్నో గొప్ప సక్సెస్ లు అందుకున్న స్టార్ హీరోయిన్స్ కొందరు, ప్రస్తుతం సరైన ఛాన్స్ లు లేక ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఇక ఒకసారి సినిమా ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్ అయి మంచి పేరు దక్కించుకున్నాక, ఆ పేరు నిలబెట్టుకోవడం ఎంతో కష్టం అని, ఎందుకంటే అక్కడి నుండి మనకు అసలైన పరీక్ష మొదలవుతుందని కొందరు హీరోయిన్లు బహిరంగంగానే గతంలో పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. 

 

ఇక ఒక సినిమా సక్సెస్ తరువాత తన గ్లామర్ ని మరింత నీట్ గా మెయింటెయిన్ చేయడం, చాలా వరకు కొవ్వు పదార్ధాలు దూరంగా ఉంచడం, అలానే డైట్ విషయంలో పూర్తిగా జాగ్రతలు వహిచడం వంటివి చేయడంతో పాటు ఎప్పటికప్పుడు నిత్యం యోగ, వ్యాయాయం వంటివి చేసి తీరాలని, ఇక వీటిలో ఏ ఒక్కటి అశ్రద్ధ చేసినా, దాని ఫలితం శరీరం మీద మాత్రమే కాదు, మన కెరీర్ మీద కూడా పడుతుందనేది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలని వారు అంటున్నారు. నిజానికి మేమేదో కోట్లు తీసుకుంటున్నాం అని బయట ప్రేక్షకులు అనుకుంటారని, అయినప్పటికి తమ అందాన్ని కాపాడుకోవడానికి ఈ నియమాలని కూడా తప్పక పాటించాల్సిన పరిస్థితి ఉందని, దానితో మా పులుసు కారిపోతోందని మరికొంతమంది హీరోయిన్లు అయితే ఓపెన్ కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: