చిత్రగుప్తుడి చిట్టా పద్దులో అందరి లెక్కలు ఉన్నట్టుగా టాలీవుడ్ సంచలన నటి శ్రీ రెడ్డి దగ్గర అందరి లెక్కలు ఉన్నాయి. తనని అందరూ వాడుకొని వదిలేశారని హీరోయిన్ ని చేస్తానని నన్ను రాత్రిళ్ళు ఆఫీసులకి పిలిచి వాళ్ళకు నచ్చినట్టు వాడుకొని ఆ తర్వాత మొహం చాటేశారని ఫిల్మ్ చాంబర్ ముందు అర్ధ నగ్నంగా ధర్నా చేసిన సంగతి తెలిసిందే. పలువురు టాలీవుడ్ ప్రముఖుల మీద ఆరోపణలు చేస్తూ శ్రీ రెడ్డి నానా రచ్చ చేసింది. అప్పటి నుంచి ఎప్పుడు ఎవరో ఒకరు హీరోల మీద, లేదా డైరెక్టర్స్ మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. 

 

నిన్న కాక మొన్న కూడా మరో నటితో గొడవపడి పోలీసు స్టేషన్ మెట్లెక్కిన సంగతి తెలిసిందే. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో ఉన్న చాలామంది హీరోలని ఏకిపారేసింది. శ్రీరెడ్డి ఇంతగా రచ్చ చేస్తున్నప్పటికి ఏ ఒక్కరు గట్టిగా మాట్లాడి తన వ్యాఖ్యలను ఖండించింది లేదు. ఇలా తను కామెంట్ చేసిన అందరూ సైలెంట్ గా ఉంటే తన మాటలే నిజమని చాలామంది ఫికైపోయారు కూడా. ఈ విషయంలో ఎక్కువగా నానీ ని ఎప్పటికప్పుడు టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంది.

 

తాజాగా నేచురల్ స్టార్ నాని, సుదీర్ బాబు, నివేదా థామస్, అదితీ రావు హైదరీ నటించిన వి సినిమా టీజర్ రిలీజైన సంగతి తెలిసందే. ఈ టీజర్ లో నాని సుధీర్ ఇద్దరు అదరగొట్టారు. డైలాగ్స్ చూస్తుంటే ఈ సారి నేచురల్ స్టార్ కి సూపర్ హిట్ పక్కా అని అర్థమవుతుంది. ఇంద్రగంటి మోహన కృష్ణ మేకింగ్ అద్భుతం అని నాని ఫ్యాన్స్ చెపుకుంటునారు. అయితే ఇదే అదునుగా శ్రీ రెడ్డి నాని ని టార్గెట్ చేస్తూ మళ్ళీ కామెంట్స్ చేసిందట. నాని వి టీజర్ చూసిన శ్రీరెడ్డి నాని నేచురల్ అంటూ మళ్ళీ బోల్డ్ కామెంట్స్ చేసిందట. ఏదేమైనా ఛాన్స్ దొరికితే, గుర్తొచ్చినప్పుడల్లా మన హీరోలని ఏకిపారేస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: