అక్కినేని కోడలుగా మారిన తర్వాత సమంత తన పంథా పూర్తిగా మార్చేసింది. కమర్షియల్ సినిమాలకు నో చెబుతూ ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు సైన్ చేస్తుంది. కథ డిఫరెంట్ గా అనిపిస్తేనే సినిమా ఓకే చేస్తుంది సమంత. లాస్ట్ ఇయర్ మజిలీ, ఓ బేబీ సినిమాలు సక్సెస్ అయ్యాయి. అయితే అదే ఉత్సాహంతో సమంత తమిళ సూపర్ హిట్ మూవీ 96 రీమేక్ లో నటించింది.జాను అంటూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. అయితే సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చినా సరే  సినిమాను కాపాడలేకపోయాయి.

 

జానుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సమంతకు దిమ్మ తిరిగి పోయే షాక్ ఇచ్చారు ప్రేక్షకులు. ఈ సినిమా ఫెయిల్యూర్ సమంతని కన్ ఫ్యూజన్ లో పడేసింది.కనీసం సమంత క్రేజీ దృష్ట్యా అయినా సినిమా యావరేజ్ గా ఆడాలి.. కానీ వసూళ్లు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. కేవలం సమంత ఇమేజ్ మీద సినిమాలు ఆడవన్న విషయం జానుతో అర్ధమైందని చెప్పొచ్చు. జాను రిజల్ట్ విషయంలో సమంత చాలా డిజప్పాయింట్ అయ్యిందని తెలుస్తుంది. జాను తర్వాత సమంత తను ఇక మీదట ఎలాంటి సినిమా చేయాలో తెలియని డైలమాలో పడేసిందని అంటున్నారు. 

 

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వెబ్ సీరీస్ చేస్తున్న సమంత అందులో నెగటివ్ రోల్ లో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. పెళ్లి తర్వాత ఈ మాత్రం ఫామ్ కొనసాగించడం గొప్ప విషయమే అయినా జాను లాంటి సినిమాలు ఓకే చెప్పడంలో సమంత మరో సారి ఆలోచిస్తే బెటర్ అని అంటున్నారు. దిల్ రాజు ఈ సినిమా ప్రపోజల్ తెచ్చిన టైం లో ఆయనకు కనిపించకుండా సమంత తప్పించుకు తిరిగింది అంటేనే సమంతకు 96 రీమేక్ చేయాలన్న ఆలోచన లేదని అర్ధమయ్యింది. సమంత నెక్స్ట్ సినిమా ఇంకా ఫైనల్ అవలేదు. ఇంకా డిస్కర్షన్ స్టేజ్ లోనే ఉన్నాయని తెలుస్తుంది. సమంత ఇక మీదట ఎలాంటి మొహమాటాలు లేకుండా పూర్తిగా కథ నచ్చితేనే సినిమా చేస్తుందట. ఎవరి బలవంతం మీదనో ఇక మీదట సినిమా లు చేయకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: