ఒక హీరో నెలకొల్పిన రికార్డులు మరో హీరో కొల్లగొట్టడం చాలా కామన్. అంతకుముందు వరకు ఇండస్ట్రీ రికార్డులు అనే వాళ్ళు.. కాని బాహుబలి రెండు పార్టులు వచ్చాక అది ఏర్పరచిన రికార్డులు అందుకోవడం కష్టమని నాన్ బాహుబలి రికార్డులు అంటూ కొత్తగా మొదలుపెట్టారు. నాన్ బాహుబలి రికార్డుల్లో కూడా పోటీ ఏర్పడ్డ విషయం తెలిసిందే. లాస్ట్ ఇయర్ రంగస్థలం నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమా రామ్ చరణ్ కెరియర్ లో ది బెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత 2020 సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురములో సినిమా మరోసారి నాన్ బాహుబలి రికార్డులు బద్దలు కొట్టింది. 

 

త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాలో పూజా హెగ్దే ఫీమేల్ లీడ్ గా చేసింది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అల వైకుంఠపురములో కొన్నిచోట్ల బాహుబలి రికార్డులు సైతం బ్రేక్ చేసింది. ఇక నాన్ బాహుబలి మాత్రమే కాదు బాహుబలి 1, 2 రికార్డులు సైతం తిరగ రాసేలా వస్తుంది ఆర్.ఆర్.ఆర్. మాములుగా ఒక స్టార్ హీరోతోనే సంచలనాలు సృష్టించే రాజమౌళి ట్రిపుల్ ఆర్ ను ఇద్దరు సూపర్ స్టార్స్ తో తీస్తున్నాడు. 2021 జనవరి 8న ఈ సినిమా వస్తుంది. రియల్ లైఫ్ సూపర్ స్టార్స్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ఇద్దరి కథలతో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు రాజమౌళి. 

 

ఇక ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసినా రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో చేసే సినిమాతో అవన్నీ బ్రేక్ చేయడం పక్కా అంటున్నారు. కొన్నాళ్ళుగా చర్చల్లో మాత్రమే ఉన్న ఈ కాంబో మూవీ కార్యరూపం దాల్చబోతుందని ఫిల్మ్ నగర్ టాక్. rrr పూర్తి కాగానే రాజమౌళి నెక్స్ట్ చేసే సినిమా మహేష్ తోనే అంటున్నారు. ఈ సినిమాను కె.ఎల్ నారాయణ నిర్మిస్తారని తెలుస్తుంది. సినిమాలో ప్రభాస్ కూడా ఉంటాడని తెలుస్తుంది. మరి ప్రభాస్, మహేష్ ఇద్దరు క్రేజీ స్టార్స్ తో సినిమా అంటే ఇక ఆ మూవీ ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. rrr ఎన్ని రికార్డులు సృష్టించినా సరే అవన్నీ మళ్ళీ తిరగ రాసేలా రాజమౌళి, మహేష్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి మహేష్ మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: