మెగాస్టార్ చిరంజీవి.. ఇతని గురించి ఏం అని చెప్తాం...? ఎంతో కష్టపడి స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి.. తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత అంతటి స్టార్ హీరో ఎవరు అంటే కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు అది చిరంజీవి అని. అంతటి స్టార్ హీరో చిరంజీవి. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. నటనతో అభిమానులకు దగ్గర అయ్యాడు చిరంజీవి. 

 

తెలుగు ప్రేక్షకులకు, తెలుగు పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించాడు చిరంజీవి. అందుకే చిరంజీవికి ఎందరో అభిమానులు సొంతం అయ్యారు.. మాములుగా కాదు తెలుగు రాష్ట్రాల్లో లెక్క పెట్టలేనెంతమంది అభిమానులు సొంతం అయ్యారు.. దీంతో చిరంజీవి ఆ అభిమానాన్ని చూసి మరో ఎన్టీఆర్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. 

 

దీంతో చిరంజీవి రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చాడు.. అభిమానులు అంత తెగ సంబరపడ్డారు.. మన హీరో రాజకీయాల్లోకి వచ్చాడు అని.. రాజకీయాల్లోకి రాగానే ఎంతో అభిమానం చూపించారు అయన అభిమానులు. దీంతో ఆయనే ఆంధ్రప్రదేశ్ కు సీఎం అని ఫిక్స్ అయ్యాడు. కానీ సీఎం కాదు కదా.. ఎమ్మెల్యే కూడా కాలేకపోయాడు చిరంజీవి. 

 

రాజకీయాల్లోకి వచ్చాక అప్పటి వరుకు ఎలాంటి వ్యతిరేకత చూడని వ్యక్తి ఆ సమయంలో చూశాడు.. కేవలం అభిమానమే కాదు.. ప్రజల చిరాకును కూడా చూశాడు.. ప్రచారానికి వెళ్లిన చిరంజీవిపై గుడ్లతో దాడి జరిగింది. అయినా నవ్వుతూనే వచ్చేశాడు.. నిజానికి ఎన్నికల సమయంలో చిరు అభిమానులు కూడా చిరుని మోసం చేశారు. 

 

చిరంజీవిని అన్న అన్న అంటూనే మీకే నా ఓటు అంటూనే మోసం చేశారు. ఎన్నికల తర్వాత తెలిసింది. ఆయనపై అభిమానం కేవలం సినిమా వరకే అని.. రాజకీయాలలోకి వస్తే దారుణంగా ఓడించేస్తారు అని.. దీంతో ఆ సమయంలో చిరంజీవి మానసిక వేదనకు గురయ్యారట.. చెప్పాలంటే ఆ సమయంలో చిరంజీవి ఏడ్చేశారట.. కానీ అవి అన్ని అభిమానులకు కనిపించకుండా చిరునవ్వుతో దాచేశారట మెగాస్టార్ చిరంజీవి. 

మరింత సమాచారం తెలుసుకోండి: