కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం భారతీయుడు 2. ఈ సినిమా షూటింగ్‌ లో భారీ క్రేన్ కింద పడిపోవడంతో బుధవారం సాయంత్రం ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. దీనితో ఒక్కసారిగా తమిళ సినీ పరిశ్రమ షాక్ కి గురైంది. మరణించిన వారిలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. 29 ఏళ్ల మధు (డైరెక్టర్ శంకర్ పర్సనల్ అసిస్టెంట్), మరొకరు 34 ఏళ్ల కృష్ణ (శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్) ఉన్నారు. అలాగే 60 ఏళ్ల చంద్రన్, స్టాఫర్‌గా ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. 

 

గాయపడిన వారిని అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చెన్నై సమీపంలోని పూనమల్లి దగ్గర జరుగుతుండగా విషయం తెలుసుకున్న కమల్ హాసన్ వెంటనే షూటింగ్ స్పాట్ కి వెళ్ళారు. వెంటనే గాయపడిన వారిని తన కారులో ఆస్పత్రికి కూడా తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో పక్కనే కెమెరా వద్ద శంకర్ ఉన్నాడు. శంకర్ ప్రాణాలతో బయటపడినా ఆయన కాలుకి మాత్రం బలమైన గాయం అయింది. 

 

అక్కడికి వచ్చిన కమల్ హాసన్ గాయపడిన వాళ్లను హాస్పిటల్‌కు తరలించి అన్నీ దగ్గర ఉండి చూసుకున్నారు. ఈ నేపధ్యంలో ఒక ట్వీట్ చేసారు. ఈ సంఘటనను అత్యంత భయానకమైంది గా వర్ణించాడు. ముగ్గురు కొలీగ్స్‌ ని కోల్పోయానంటూ ట్వీట్ చేసి,  చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలిపాడు. వారితో కలిసి బాధను పంచుకుంటానన్న కమల్ హాసన్, గాయపడిన వారికి ఎలా ఉందో వైద్యులను అడిగి కమల్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక చికిత్స తర్వాత, అసలైన ట్రీట్‌మెంట్ జరుగుతోందని ట్వీట్ ద్వారా చెప్పారు కమల్. త్వరలోనే ఈ ప్రమాదంలో గాయపడిన వారు కోలుకుంటారు అని కమల్ ఆశాభావం వ్యక్తం చేసారు.

https://twitter.com/ikamalhaasan/status/1230208564515332096?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1230208564515332096&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Fmovies%2F3-dead-10-injured-in-mishap-during-filming-of-kamal-haasans-indian-2-nk-456902.html

 

https://twitter.com/ikamalhaasan/status/1230218371066580992?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1230218371066580992&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Fmovies%2F3-dead-10-injured-in-mishap-during-filming-of-kamal-haasans-indian-2-nk-456902.html

మరింత సమాచారం తెలుసుకోండి: