అవును.. చాలామంది ప్రేక్షకులు ఆ సీరియల్ చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ సీరియల్ ఏంటి రా బాబు అని తలా కొట్టుకుంటున్నారు.. ఎందుకు ఈ సీరియల్ చూపిస్తున్నారు.. అసలు మాకు ఎందుకు ఈ బాధ.. సీరియల్ చూడకూడదు అనుకున్న.. ఏదో ఒకరోజు ఆ హీరోయిన్ కి న్యాయం జరగకపోదు అని అలాగే చూస్తున్నాం అంటూ వాపోతున్నారు కొందరు. కానీ ఎప్పుడు జరుగుతుంది న్యాయం. 

 

అవును.. ఏ సీరియల్ అయినా.. ప్రారంభం అయినప్పటి నుండి హీరోయిన్ కి కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు పోయి హీరోయిన్ కి మంచి జరగాలి అంటే.. ఎంత కాదు అన్న సంవత్సరం నుండి రెండు సంవత్సరాలు సమయం పడుతుంది. ఇంకా ఎప్పుడు అండి ఆ హీరోయిన్ కి కష్టాలు తీరేది.. 

 

సరే ఇదంతా కాదు.. ఆ సీరియల్ పేరు ఏంటి అనుకుంటున్నారా? ఆ సీరియల్ పేరు ''ఇంటింటి గృహలక్ష్మి'' కానీ ఆ గృహాలక్ష్మికి ఆ గృహంలో అస్సలు మర్యాదలేదు.. భర్తకు ఏమి లేనప్పుడు అండగా ఉన్న భార్యను ఎదిగాక చీడపురుగుని చూసినట్టు చూసే భర్త.. ఇంగ్లీష్ రాదు అని.. చదువులేదు అని.. అసహ్యించుకునే పిల్లలు.. అష్టకష్ఠాలు పెట్టి రాక్షసానందం పొందే అత్త... ఇవి అన్ని చాలదు అని.. ఆ గృహలక్ష్మి ప్లేస్ కొట్టేయాలి అనుకునే లేడీ విలన్. 

 

ఇంతమంది మధ్యలో ఆమె పడే కష్టం అంత ఇంత కాదు.. సరే ఇవి అన్ని ఉంటాయి.. కానీ ఈ సీరియల్ లో బాగా కోపం తెప్పించే అంశం ఏంటి అంటే? వాళ్ళు అన్ని కష్టాలు పెడుతున్న.. అన్ని మాటలు అంటున్న.. చులకనా చేసి మాట్లాడిన ఆమె ఒక్క మాటా మాట్లాడదు.. ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తుంది.. ఏం అంటే నా కుటుంబం అంటుంది.. భూదేవి అంత ఓర్పు అని బ్యాక్ గ్రౌండ్ సాంగ్. సీరియల్ చూసినంత సేపు నరాలు చిట్లిపోతాయి.. ఛీ ఏంటి ఈ సోది అని అంటున్నారు నెటిజన్లు. 

 

ఇక పోతే ఈ సీరియల్ లో టాలీవుడ్ సీనియర్ నటి అయినా కస్తూరి గృహలక్ష్మి పాత్ర పోషిస్తుంది. ఇక ఈ సీరియల్ హిందీ సీరియల్స్ రేంజ్ లో ఉంది. కానీ సీరియల్ లో గృహాలక్ష్మికి.. ఒక అమ్మకు పెట్టె టార్చర్ మాత్రం చాలా ఘోరంగా ఉంది.. ఆమె ఓర్పు మాకు అర్థం అయ్యింది.. ఇక ఆ కుటుంబానికి తల్లి విలువ తెలిసేలా చేస్తే ఆ సీరియల్ అందంగా ఉంటుంది.. అలా కాదు అని ఆమెను అలాగే టార్చర్ చేస్తే సీరియల్ ని బ్యాన్ చెయ్యాల్సి ఉంటుంది అని అంటున్నారు బుల్లితెర ప్రేక్షకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: