బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న rrr సినిమాపై తారా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. రియల్ హీరోస్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల్లో రామ్ చరణ్, తారక్ కనిపించనున్నారు. డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా అసలైతే ఈ ఇయర్ జులైలో రిలీజ్ అవ్వాల్సింది కాని అనుకున్న విధంగా షూటింగ్ జరుగకపోవడం వల్ల 2021 జనవరి 8కి సినిమా వాయిదా వేశారు. ఈ సినిమా రిలీజ్ కు మరో ఏడాది ఉన్నా బిజినెస్ మాత్రం ఇప్పుడే జరుగుతుంది. థియేట్రికల్ రైట్స్ ఎంతకీ లాక్ చేశారో ఇంకా తెలియలేదు కాని డిజిటల్ రైట్స్ మాత్రం భారీ మొత్తానికి అమ్మేశారట. 

 

అన్ని భాషల్లో కలిపి ఆర్.ఆర్.ఆర్ సినిమా డిజిటల్ రైట్స్ 260 కోట్ల దాకా కోట్ చేశారట. ఈ రేంజ్ లో డిజిటల్ రైట్స్ డిమాండ్ చేసిన సినిమా ఇది ఒక్కటే. అలా బిజినెస్ మొదలుపెట్టడమే రికార్డులు సృష్టిస్తుంది RRR. సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అలియా భట్అజయ్ దేవగన్ నటిస్తున్నారు. హాలీవుడ్ స్టార్ ఒలివియా మోరిస్ కూడా ఈ మూవీలో నటిస్తుంది. డిజిటల్ రైట్స్ తో పాటుగా అన్ని భాషల శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటుకి ఇచ్చారట. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఈసారి rrr తో మరోసారి తానేంటో చూపించాలని ఫిక్స్ అయ్యాడు. 

 

rrr తప్పకుండా గ్రాండ్ విజువల్ ఫీస్ట్ అనుభూతి అందించేందుకు రెడీ అవుతుంది. చరణ్, తారక్ ఇద్దరు తమ నట విశ్వరూపం చూపిస్తారని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత చరణ్, తారక్ కూడా నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకోవడం గ్యారెంటీ. 2021 సంక్రాంతి ట్రిపుల్ ఆర్ తో పండుగ మరింత స్పెషల్ కానుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: