జూనియర్ ఎన్టీఆర్ తమిళ హీరో విజయ్ కి అండగా ఉంటాను అంటూ భరోసా ఇచ్చాడ అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్  సినిమా చేస్తున్నాడు. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో కొమరంభీమ్ పాత్రలో కనిపించబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. కాగా ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్లో నెక్స్ట్ మూవీ చేయనున్నట్లు తాజాగా ప్రకటన కూడా చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే తమిళ హీరో విజయ్ విషయానికొస్తే వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. మొన్నటికి మొన్న బిగిల్ మూవీ తో మంచి విజయం అందుకొన్నాడు. తెలుగులో విసిల్ పేరుతో ఈ సినిమా డబ్  చేశారు. ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది ఈ చిత్రం. 

 

 

 ఇక ప్రస్తుతం ఖైదీ ఫెమ్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తమిళ హీరో విజయ్ తన నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా మాస్ టైటిల్తో తెరకెక్కుతున్నది . సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురానున్నారు. ఏప్రిల్ 10న విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో తమిళ హీరో విజయ్ ని ఢీ కొట్టే విలన్ గా  విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చారు. 

 

 

 ఇదిలా ఉంటే ఈ సినిమాలో తమిళ హీరో విజయ్ కూడా ఓ పాట పాడుతున్నట్లు  తెలుస్తోంది. విజయ్ గతంలో కూడా పలు సినిమాల్లో పాటలు పాడి తన టాలెంట్ ఏమిటో నిరూపించాడు. ఇక ఈ సినిమాలో కూడా కొట్టి స్టోరీ పాటను విడుదల చేశారు. కాగా ప్రస్తుతం తమిళ హీరో విజయ్ పాడిన లెట్ మీ సింగ్ ఏ కొట్టి స్టోరీ పాడిన పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా  మారింది. అయితే ఇంతకీ తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ తమిళ హీరో విజయ్ కి ఏ విధంగా అండగా ఉండబోతున్నాడు అంటే... తమిళ సినిమాలో  హీరో విజయ్ పాడిన పాటలు తెలుగులో ఎన్టీఆర్ పాడబోతున్నాడు అనే సమాచారం. దీని కోసం చిత్రబృందం ఇప్పటికే ఎన్టీఆర్ ను సంప్రదించగా ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ కన్నడ మూవీ లో  గెలియా గెలియా పాట కూడా పాడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: