టాలీవుడ్ లో సెన్సేషన్ హీరో ఎవరు అంటే వెంటనే చెబుతారు విజయ్ దేవరకొండ. నటించింది కొన్ని సినిమాలే అయినా ఈ హీరో స్టార్ రేంజ్ కి ఎదిగిపోయాడు. పెళ్లిచూపులు సినిమాతో హీరోగ పరిచయం అయిన విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి, గీతాగోవిందం, టాక్సీవాలా వరుస విజయాలతో పాపులారిటి బాగా పెరిగిపోయింది. ఈ మూవీలో బాక్సాఫీస్ హిట్ కావడమే కాదు.. కలెక్షన్లు కూడా బాగా వచ్చాయి. ఇక ఈ మూవీలతో విజయ్ దేవరకొండ కోలీవుడ్ లో కూడా అడుగు పెట్టారు. నోటా, డీయర్ కామ్రెడ్ సినిమాలో కోలీవుడ్ లో అడుగు పెట్టి అక్కడ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నారు.
వాస్తవానికి తెలుగులో యూత్ ఐకాన్ గా ఉన్న విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ కి తమిళ నాట కూడా మంచి స్పందన వస్తుందని భావించారు. కానీ నోటా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక రష్మికతో వచ్చిన డీయర్ కామ్రెడ్ కూడా డిజాస్టర్ టాక్ రావడంతో మనోడు ఆలోచనలో పడ్డారని వార్తలు వచ్చాయి. ఈ ఏడాది నలుగురు హీరోయిన్లతో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తాను ఒకటీ రెండు రన్స్ కొట్టనని అంత ఓపిక లేదని.. ఏకంగా సిక్స్ కొట్టడానికి వస్తున్నా అని అన్నారు. దాంతో ఈ మూవీ భారీ హిట్ అవుతుందని భావించారు. కానీ థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత దారుణమైన టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం.. రివ్యూలు కూాడా బ్యాడ్ గా రావడంతో కలెక్షన్లపై కూడా ఎఫెక్ట్ పడింది.
సినిమా విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకున్న తర్వాత విజయ్ దేవరకొండ మీడియాకి ముఖం చూపించడం మానేసాడు. సినిమా విషయం మాట్లాడాల్సి వస్తుందనో.. లేదంటే పోయిన సినిమాకి బ్యాండ్ వాయించడం అవసరం లేదనుకున్నాడో కానీ.. విజయ్ దేవరకొండ మాత్రం 'వరల్డ్ ఫెమస్ లవర్' ని కనీసం సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేయకుండా దూరంగా ఉంటున్నారు. ఏది ఏమైనా ఫ్లాప్ టాక్ బాగానె దెబ్బేసినట్లు తెలుస్తుంది.