ఇండియాలోనే ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థగా పేరున్న యష్ రాజ్‌ ఫిలింస్‌ సంస్థకు కన్‌జ్యూమర్‌ ఫోరం షాక్‌ ఇచ్చింది. నేషనల్‌ కన్‌జ్యూమర్‌ డిస్ప్యూట్‌ రిడ్రెసల్‌ కమీషన్ పది వేల రూపాయల పరిహారం చెల్లించాలంటూ నిర్మాణ సంస్థను ఆదేశించింది. మహారాష్ట్రకు చెందిన ఓ టీచర్‌ షారూఖ్ హీరోగా తెరకెక్కిన ఫ్యాన్‌ సినిమా తనను నిరాశపరిచిందని కంప్లయింట్ ఇవ్వటంతో కన్‌జ్యూమర్‌ ఫోరమ్‌ పై విధంగా తీర్పునిచ్చింది.

 

వివరాల్లోకి వెళితే.. అఫ్రీన్‌ ఫాతిమా జైదీ వృత్తి రీత్యా ఉపాద్యాయుడు. ఆయన ఫ్యాన్‌ సినిమా ప్రమోషన్‌ సందర్భంగా రిలీజ్ చేసే జబ్రా సాంగ్‌ను చూసి ఎంతో ఇంప్రెస్‌ అయ్యాడు. ఆ పాటను వెండితెర మీద చూడాలిన ఆశపడ్డాడు. అదే ఉద్దేశంతో థియేటర్‌కు వెళ్లాడు. అయితే సినిమాలో ఆ పాట లేకపోవటం ఆ అభిమాని తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో తనను చిత్రయూనిట్ ఉద్దేశ పూర్వకంగా మోసం చేసిందంటూ ఆయన కన్‌జ్యూమర్‌ ఫోరమ్‌ను ఆశ్రయించాడు.

 

దీనిపై విచారణ జరిగిన ఎన్‌ సీ డీ ఆర్‌ సీ, నిర్మాణ సంస్థ తీరును తప్పు పట్టింది. సినిమాలో లేని సన్నివేశాలను పాటలను ప్రమోషన్‌లో వాడటం అన్యాయమైన వ్యాపార పద్దతి అని అభిప్రాయపడింది. నిర్మాణ సంస్థ ఉద్దేశపూర్వకంగానే ఇలా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించటం కోసం మోసం చేసిందని వ్యాఖ్యనించింది కన్‌జ్యూమర్‌ ఫోరమ్‌. అంతేకాదు అసలు ప్రమోషన్‌లో పాటను వినియోగించి సినిమాలో ఆ పాటను తీసేయటం వెనుక కారణం ఏంటో నాకు అర్థం కావటం లేదు.

 

అయితే ఈ పాట కేవలం ప్రమోషనల్‌ సాంగ్ మాత్రమే అని తాము ముందే వెళ్లడించామని చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్‌, హీరో షారూఖ్‌లు వాదించినా ఎన్‌ సీ డీ ఆర్‌ సీ వారి వాదనతో ఏకీభవించలేదు. ప్రోమో చూసిన ఆడియన్ అది తప్పకుండా సినిమాలో ఉంటుందన్న ఉద్దేశంతోనే సినిమా చూస్తాడు. కానీ ఆ ప్రొమో సినిమాలో లేకపోవటం మోసం చేయటమే అని తీర్పు నిచ్చింది. అలా మోసం చేసినందుకు గాను పది వేల రూపాయలు సదరు ప్రేక్షకుడికి చెల్లించాలంటూ నిర్మాణ సంస్థను ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: