గుణశేఖరన్ సినిమాటోగ్రఫీ , హై క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ , యూత్ కి నచ్చే డాన్సులు , శ్రద్ధ దాస్, సయామీ ఖేర్ ల గ్లామర్ ట్రీట్గుణశేఖరన్ సినిమాటోగ్రఫీ , హై క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ , యూత్ కి నచ్చే డాన్సులు , శ్రద్ధ దాస్, సయామీ ఖేర్ ల గ్లామర్ ట్రీట్స్టొరీ , వీక్ స్క్రీన్ ప్లే , డైరెక్షన్ , లౌడ్ ఎక్స్ ప్రెషన్స్ , లౌడ్ మ్యూజిక్ , ఓవర్ ఎమోషన్స్ , సొల్లు కామెడీ , సీన్ కి మించి చేసిన ఓవర్ యాక్షన్స్ , కనెక్ట్ కాని ఎమోషన్స్ , రన్ టైంజెన్న (శ్రద్ద దాస్) ఓ స్టార్ మెక్సికన్ పాప్ సింగర్.. రెండు సార్లు 'బెస్ట్ అఫ్ ది వరల్డ్' టైటల్స్ గెలుచుకున్న జెన్నకి మూడవ సారి ఇండియా నుంచి వచ్చిన సాండీ(ఫర్హద్ షనవాజ్) టఫ్ కాంపిటీషన్ ఇస్తాడు. దాంతో జెన్నని ఆరాధించే మెక్సికన్ డాన్ డాంగే (అర్పిట్ రాంఖా) సాండీని చంపేస్తాడు. అక్కడి నుంచి కట్ చేస్తే ఇండియా నుంచి అమృత (సయామీ ఖేర్) ఎలాగైనా ఆ 'బెస్ట్ అఫ్ వరల్డ్' కాంపిటీషన్ లో పాల్గొని టైటల్ గెలుచుకోవాలన్న కోరికతో అమెరిక వస్తుంది. బెస్ట్ అఫ్ వరల్డ్ లో ఎంట్రీ కోసం జమైకాలోని బాబ్ మార్లీ కాలేజ్ లో చేరుతుంది.
అక్కడే మన హీరో రాకెట్ అలియాస్ రాక్ చదువుతూ ఉంటాడు. రాక్ వాళ్ళ బాచ్ ని అమృత గ్రూప్ లో వేస్తారు. రాక్ కెరీర్ ని సీరియస్ గా తీసుకోకుండా అమ్మాయిల వెంట పడుతూ ఉంటాడు. ఓ రోజు రాక్ లైఫ్ లో జరిగిన ఓ సంఘటన వలన బెస్ట్ అఫ్ వరల్డ్ టైటిల్ కోసం అమృతతో కలిసి కాంపిటీషన్ లో పాల్గొంటుంది. కానీ అమెరికన్ పాప్ సింగర్ జెన్న రాక బత్చ్ ని అడ్డుకోవడానికి ట్రై చేస్తుంది. అస్సలు జమైకాలోని రాక్ బ్యాండ్ ని జెన్న ఎందుకు అడ్డుకోవాలనుకుంది.? జెన్న ఎత్తులకు రాక్ ఎలాంటి కౌంటర్ అటాక్స్ ఇచ్చి ఫైనల్స్ కి వచ్చాడు. చివరికి బెస్ట్ పఫ్ వరల్డ్ టైటిల్ ని మూడోసారి జెన్న గెలుచుకుందా.? లేక రాక్ బ్యాండ్ వాళ్ళు గెలుచుకున్నారా.? అన్నది మీరు వెండితెర పైనే చూడాలి.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన మొదటి సినిమా.. ఇప్పటికే ఓ సినిమా వచ్చేసింది కావున కొంతమంది ఫస్ట్ సినిమా అనే యాంగిల్ లో చూడరు. విమర్శకుల పరంగా ఇది ఫస్ట్ సినిమా కావున ఆ ప్రకారమే సాయి ధరమ్ తేజ్ లోని నటన కౌశల్యం గురించి చెబుతా..

చెప్పాలంటే సాయి ధరమ్ తేజ్ లో విషయం ఉంది, కరెక్ట్ గా వాడుకుంటే బాగానే చేస్తాడు. కానీ వైవిఎస్ చౌదరి హీరోని ఒక మెట్టు పైకి తీసుకెళ్ళి ఫస్ట్ సినిమాలోనే ఓవర్ ఇమేజ్ క్రియేట్ చేసి చూపించాలి అనుకుంటాడు. ఈ ఓవర్ ఇమేజ్ కి, కరేబియన్ బ్యాక్ డ్రాప్ అనుకోవడంతో అది మరింత ఎక్కువైంది. సాయి ధరమ్ తేజ్ చేత చేయించిన డాన్సులు, ఫైట్స్ తప్ప మిగతా ఏవీ ఆడియన్స్ ని మెప్పించవు. మ్ఖ్యంగా ఎక్స్ ప్రెషన్స్ పరంగా, ఎమోషన్స్ పరంగా మరీ నీరుగార్చేలా పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. చాలా చోట్ల మరీ లౌడ్ ఎక్స్ ప్రెషన్స్ తో చేయించిన సీన్స్ కాస్త ఎబ్బెట్టుగా ఉండడమే కాకుండా చిరాకు తెప్పిస్తాయి. ఎందుకు మరీ ఇంత ఓవరాక్షన్, కాస్త సెటిల్ గా చెయ్యచ్చుగా అనే ఫీలింగ్ కూడా కలిగిస్తుంది. ఈ ఓవరాక్షన్ కనెక్ట్ అయ్యే ఆడియన్స్ కొంతమంది సి సెంటర్ మాస్ లో ఉండచ్చు కానీ మిగతావారికి అస్సలు నచ్చదు. మెగా ఫ్యామిలీ ఇమేజ్ వల్ల ఈ సినిమా తనకి ఓపెనింగ్స్ తెచ్చినా ఇదే రేంజ్ పెర్ఫార్మన్స్ ముందు ముందు చూపితే తన కెరీక్ కే నష్టం. సాయి ధరమ్ తేజ్ ఇంప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది.

శ్రద్ద దాస్ ఫుల్ గ్లామరస్ గా కనిపించడమే కాకుండా నెగటివ్ షేడ్స్ ని బాగానే చూపించింది. కానీ వైవిఎస్ ఓవరాక్షన్ వల్ల చెయ్యాల్సిన దానికన్నా ఎక్కువ చేయడం వల్ల.. అర్ద రూపాయి యాక్షన్ చెయ్యాల్సిన చోట రూపాయి రేంజ్ ఓవరాక్షన్ ఎందుకు చేస్తోంది ఈ భామ అనే ఫీలింగ్ వస్తుంది. కానీ శ్రద్ధ దాస్ బాగా కష్టపడి చేసిన ఈ పాప్ సింగర్ పాత్ర తనకి మంచి పేరునే ఇస్తుంది. శ్రద్ధ దాస్ తన అందాల ఆరబోతతో మరింత గ్లామరస్ గా, స్టైలిష్ గా కనిపిస్తూ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకోవచ్చు.

సయామీ ఖేర్

ఈ సినిమాతో పరిచయం అయిన కొత్త హీరోయిన్ సయామీ ఖేర్.. సయామీ ఖేర్ ని హీరోయిన్ అనడం కంటే హీరో అనడమే బెటర్ ఏమో.. ఎందుకంటే తన లుక్ చూడటానికి మగరాయుడిలా ఉంటుంది, చూసే వారికి ఇది హీరోయిన్ ఆ లేక హీరోనా అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే జీరో ఎక్స్ ప్రెషన్ ఫేస్.. సినిమా మొత్తంలో ఒక్క ఎక్స్ ప్రెషన్ కూడా ఫేస్ లో పలకలేదు. అది పక్కన పెడితే సినిమా మొత్తం పొట్టి పొట్టి బట్టల్లో బాగా అందాలు మాత్రం ఆరబోసింది. డాన్సులు కూడా ఓకె అనేలా వేసింది. మొత్తంగా సయామీ ఓవర్ రియాక్షన్స్ వలన సయామీ ఖేర్ వస్తే అందాలు చూడాలే తప్ప ఎక్స్ ప్రెషన్ చూడకూడదని అని ఫిక్స్ అవుతారు.

ఇక డాన్ రోల్ చేసిన అర్పిట్ రాంఖా ఓకే అనిపించాడు. ఒక్కో సీన్ లో వచ్చే అలీ, వేణు మాధవ్, రఘు బాబులు నవ్వించకపోగా బాగా ఇర్రిటేట్ చేస్తాయి. సీనియర్ నరేష్, తనికెళ్ళ భరణి, హేమలు డీసెంట్ పెర్ఫార్మన్స్ తో అలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఈ సినిమాకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ వైవి ఎస్ చౌదరి. అలాగే ఈ సినిమాని ఆడియన్స్ కి నచ్చకపోవడానికి, చిరాకు పెట్టడానికి కూడా ఆయనే కారణం. ప్రతి సినిమాలో అవసరానికి మించి చూపాలనుకునే ఓవరాక్షన్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ లాస్.. మీరు కరేబియన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీసారు, వాళ్ళంతా లౌడ్ ఎక్స్ ప్రెషర్స్ అయితే హీరో రేంజ్ ని కూడా చూసి ఓవర్ దోస అనేది పెట్టాలి కదా.. చెప్పాలంటే సాయి ధరమ్ తేజ్ మంచి నటుడే కానీ డైరెక్టర్ చెప్పింది చేయడం వల్ల అతనికి నటన తెలియదేమో అనే ఫీలింగ్ క్రియేట్ అయ్యింది. ఇకపోతే కథ కోసం ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ అదే పాప్ సింగర్ కాంపిటీషన్, కరేబియన్ నేపధ్యం కొత్తగా ఉండచ్చు కానీ కథలో కొత్తదనం లేదే.. మొదటి 10 నిమిషాల్లోనే కథ చెప్పేస్తాడు. ఆ తర్వాత నుంచి చివరి వరకు ఏమి జరుగుతుందనేది రెండో క్లాస్ కుర్రాడు కూడా చెప్పగలడు. దీన్ని బట్టే ఎంత బోరింగ్ స్క్రీన్ ప్లే రాసాడన్నది మీకు అర్థమైపొయిన్ ఉంటుంది.
REY Movie Latest Working Stills 1
సరే అనుకున్న కాన్సెప్ట్ ని ముక్కుసూటిగా అన్నా చెప్పారా అంటే అదీ లేదు హీరో క్యారెక్టర్ ని రెండు సీన్స్ లో చెప్పేయాలి, కానీ అలా కాకుండా ఇంటర్వల్ వరకూ సాగదీశాడు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే సాయి ధరమ్ తేజ్ - సయామే ఖేర్ ల ఎపిసోడ్ చాలా చాలా చాలా బోరింగ్. సీట్లో కూర్చోలేం. దానికి తోడూ విచ్చల విడిగా పాటలు వచ్చేస్తుంటాయి. ఎందుకు అన్ని పాటలు.. మీకు అబ్రాడ్ లో లోకేషన్స్ దొరికాయి, చేతిలో అందాలు ఆరబోసే హీరోయిన్స్ ఉన్నారని పాటలు తీసేస్తారా.. సినిమాకి అవసరం ఉందా లేదా అన్నది ఆలోచించరా.. కథ, స్క్రీన్ ప్లే తో పాటు సీనియర్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి నటీనటుల నుంచి సరైన హావభావాలు రాబట్టుకోలేకపోవడం కూడా ఈ సినిమాకి పెద్ద మైనస్.. ఇక అసలు లాజిక్ లు అనేవే లేవు.. జమైకా లో హీరో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నానని, వీలైతే వాళ్ళని పట్టుకోండి అని చెప్పడం పోలీసులు తన మొహం తెలిసినా కూడా పట్టుకోలేకపోవడం ఏంటో.? అంటే పోలీసులని అంత వేదవాలుగా చూపించారు.? ఒక వదిలేయ్.. సెకండాఫ్ లో అమెరికన్ పోలీసులు టెర్రరిస్ట్ అని హీరోని అరెస్ట్ చేసి అంత సింపుల్ గా అలా ఎలా వదిలేసారు..? అమెరికాలోనే పెద్ద డాన్ డాంగే కానీ హీరోని ఏమీ చేయలేకపోయి తింగర తింగరగా ప్రవర్తిస్తుంటాడు. అలాగే కాంపిటీషన్ కి చాన్సే లేదు, కానీ కాంపిటీషన్ కి వెళ్ళిపోతారు. ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే మన ఓంకార్ అన్నయ్య ఆట షో చూసినట్టు ఉంటుంది. నా ఉద్దేశం ఏమిటంటే ఎలిమినేషన్ మళ్ళీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ.. జెన్న పాత్రని హాయ్ రేంజ్ లో చూపిస్తారు, కానీ తనని హీరో సింపుల్ గా కిడ్నాప్ చేసేస్తాడు.  ఇకపోతే వై ఎఒక్క పాత్రకి మొదటి నుంచి చివరి దాకా ఓ క్యారెక్టర్ అనేది ఉండదు. వీటన్నిటికి మించి సుత్తి లేకుండా సూటిగా 2 గంటల్లో చెప్పాల్సిన సినిమాని దాదాపు 3 గంటలు చెప్పాడు. ఇలా అన్ని రకాలుగా వైవిఎస్ చౌదరి ఫెయిల్ అయ్యాడు.

ఇక మిగిలిన విభాగాల విషయానికి వస్తే.. గుణశేఖరన్ సినిమాటోగ్రఫీ డీసెంట్ అనిపిస్తుంది. ఆయన ఉన్నతలో లోకేషన్స్ ని బాగానే చూపించాడు. ఇక సిజి విజువల్స్ మాత్రం చాలా నాశిరకంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అస్సలు బాగాలేదు. ఆయన ఎడిటింగ్ సినిమాకి అస్సలు హెల్ప్ అవ్వలేదు. చక్రి అందించిన పాటలేవీ పెద్దగా బాలేవు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. రాజు సుందరం, ప్రేమ్ రక్షిత్, జానీ, భానోదయ కోరియోగ్రఫీ బాగానే ఉంది. శ్రీధర్ శ్రీపాన రాసిన డైలాగ్స్ జస్ట్ ఓకే.. అక్కడక్కడా బాగా ఓవర్ అయ్యాయి. నిర్మాణ విలువలు కూడా జస్ట్ ఓకే... వైవిఎస్ చౌదరి టాలీవుడ్ ఆడియన్స్ కి కొత్తదనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక పాప్ దివా బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు. అందులో తప్పులేదు. కానీ ఆ బ్యాక్ డ్రాప్ ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయలేకపోతే.. తను ఎన్ని దేశాలు తిరిగి ఎంతలా చూపించినా ఉపయోగం అయితే ఉండదు. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది.. పాత్రల్లో పాప్ సింగర్స్ అనే ఫీలింగ్, ఒక పాప్ కాంపిటీషన్ అనే ఫీలింగ్ ని ఆడియన్స్ కి కలిగించలేకపోయాడు. అక్కడే డైరెక్టర్ గా ఫెయిల్ అయిపోయాడు.

అలాగే ఏ పాత్రలోని ఎమోషన్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేదు. దాంతో సినిమా మొత్తంలో ఆడియన్స్ ఏ ఒక్క పాత్రకి కనెక్ట్ కాలేదు. దానికి హీరోయిన్స్ ఉన్నారుగా అని శృతి మించిన అందాల ఆరబోత, మాట్లాడితే ఓ పాట పెట్టడం, ప్రతి సీన్ ని 5 నిమిషాలు సాగదీయడం, ప్రతి సీన్ లోనూ ఆపేయండ్రోయ్ అనే ఫీలింగ్ ఆడియన్స్ లో కలిగించడం, ఇక లెక్కలేనన్ని లూప్ హోల్స్ ఈ సినిమాని ఆడియన్స్ కి దగ్గర కానీకుండా చేస్తాయి.
ఓవరాల్ గా రెండు సంవత్సరాల నుంచి ఊరిస్తున్న రేయ్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచి వెళ్ళిపోయింది. ఒకవేళ ఈ సినిమా పిల్లానువ్వు లేని జీవితం కంటే ముందు వచ్చి ఉంటే సాయి ధరం తేజ్ మీద భీభత్సమైన నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యి ఉండేది. ఒక విధంగా ఈ సినిమా లేట్ గా రిలీజ్ అయ్యి సాయి ధరమ్ తేజ్ కి హెల్ప్ చేసింది. Sai Dharam Tej,Saiyami Kher,Shraddha Das,Y.V.S.Choudary,Chakri.రేయ్ - ఇది సక్సెస్ కోసం అరిచే అరుపు కాదు.. ఆడియన్స్ ని భయపెట్టే అరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: