బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ చిత్రంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో  రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో క‌నిపించ‌నున్నారు. ఇక ఈ ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కావాల్సిన సినిమాను వచ్చే ఏడాది జనవరి 8 కి పోస్ట్ ఫోన్ చేసిన సంగ‌తి తెలిసిందే. అంటే సంక్రాంతికి సినిమా రాబోతుందన్నమాట.  

 

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంటే, చరణ్‌కు జోడిగా హిందీ నటి అలియా భట్ నటిస్తోంది. 1920నాటి పరిస్థితులను ప్రతిబింబిస్తూ స్వాతంత్ర్యోద్యమ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. చరిత్రలో ఎప్పుడూ కలవని తెలుగు వీరులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు... యువకులుగా అఙ్ఞాతంలో ఉన్న సమయంలో వారి మధ్య స్నేహం ఏర్పడితే ఎలా ఉంటుంది? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం సినిమాలో ఎన్టీఆర్‌ పోషిస్తున్న కొమురం భీం పాత్ర.. అల్లూరి పాత్ర కంటే కాస్త ఎక్కువ ఉంటుందని అంటున్నారు. ఎన్టీఆర్‌కు ఉన్న ఇంట్రడక్షన్‌ భారీ ఫైట్‌ సీన్‌ చరణ్‌ కు ఉండదట. సింపుల్‌గా చరణ్‌ ఎంట్రీ ఇస్తాడట. ఇలా అనేక చోట్ల ఎన్టీఆర్ పాత్ర ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌.

 

దీంతో చిరంజీవి చాలా సీరియస్‌గా ఉన్నాడని, తాను మొదటి నుండి పట్టించుకోకుండా ఉండటంతో ఇలా చేస్తారా అంటూ రాజమౌళిపై చిరంజీవి ఫైర్ అవుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ రీ షూటింగ్ కూడా డిమాండ్‌ చేస్తున్నాడట చిరు. నిర్మాత దానయ్యను తాను ఒప్పిస్తాను ఎన్టీఆర్‌ కంటే తక్కువ పాత్ర ఉంటే మాత్రం ఒప్పుకునేది లేదు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాడ‌ట‌. ఇక‌ చేసేదేమి లేక రాజమౌళి రీషూటింగ్‌ చేసేందుకు సిద్దం అయినట్లుగా టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ విష‌యంపై పెద్ద ఎత్తున ఇండస్ట్రీలో చర్చలు కూడా జ‌రుగుతున్నాయ‌ట‌. అయితే కొంద‌రు మాత్రం ఇవి పుకార్ల‌ని  కొట్టి పారేస్తున్నారు. మ‌రి ఇవి ఎంత వ‌ర‌కు నిజ‌మో చిత్ర యూనిట్‌కే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: