మెగా డాటర్ గా మెగా అభిమానులలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నిహారిక ఎక్స్ పోజింగ్ కు దూరం అని తరుచూ చెపుతూ ఉండేది. దీనితో ఆమెకు గ్లామర్ పాత్రలు ఇవ్వకుండా కేవలం ఆమెను నటిగా ఎలివేట్ చేసే పాత్రలతో సినిమాలు తీసారు. 


అయితే ఇప్పటి వరకు నిహారిక నటించిన సినిమాలు అన్నీ ఫ్లాప్ కావడంతో ఆమె అంచనాలు అన్నీ తారుమారు అయ్యాయి. ఆమధ్య నిహారిక సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుంటుంది అన్న వార్తలు కూడ వచ్చాయి. అయితే ప్రస్తుతం నిహారిక తన సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకుని వెబ్ సిరీస్ లు చేసే పనిలో బిజీగా ఉంది. 


ఇలాంటి పరిస్థితులలో ఆమె లేటెస్ట్ గా గ్లామర్ ను ఎక్స్ పోజ్ చేస్తూ ఇచ్చిన ఫోటో షూట్ కు సంబంధించిన స్టిల్స్ చూసిన వారు ఈ మెగా డాటర్ కు ఏమైంది అంటూ ఆశ్చర్య పడుతున్నారు. ఈ ఫోటో షూట్ కు సంబంధించిన స్టిల్స్ నిహారిక తానే స్వయంగా తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో షేర్ చేయడంతో ఆమెకు ఉన్న 1.2 మిలియన్ ఫాలోయర్స్ మధ్య ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.  


షర్ట్ బటన్స్ తీసేసి తన గ్లామర్ ను ఎక్స్ పోజ్ చేస్తూ ముఖంలో చిరునవ్వు కనిపించేలా చేస్తూ ‘మిమ్మల్ని ఏది నవ్విస్తుంది' అనే క్యాప్షన్ తో ఈ హాట్‌ ఫోటో షూట్ ఉద్దేశ్యం ఏమిటి అంటూ చాలామంది దర్శక నిర్మాతలు మధన పడుతున్నట్లు టాక్. అందరి హీరోయిన్స్ లాగే తాను కూడ గ్లామర్ రోల్స్ కు రెడీ అన్న సంకేతాలు నిహారిక పరోక్షంగా ఇస్తోందా అన్న సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి. వాస్తవానికి నిహారిక సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం ఇష్టం లేని చిరంజీవి దృష్టి వరకు నిహారిక షేర్ చేస్తున్న ఫోటోలు వెళ్ళాయ లేదా అన్న విషయమై కూడ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: