బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ గత కొంత కాలంగా అస్సలు కలిసి రావడం లేదు.  గత ఏడాది ఆయన సినిమాలు ఏవీ పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలేదు.  తాజాగా బాలీవుడ్‌తో పాటు కన్నడ సినిమాల్లో దిగ్గజ నటిగా పేరుపొందిన కిషోరి బల్లాల్‌ కన్నుమూశారు.  ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకొని కంటతడి పెట్టారు షారూఖ్ ఖాన్. సాధారణంగా మనిషికి బాగా టెన్షన్ ఉంటే.. సిగరేట్ లేదా చాయ్ తాగుతుంటారు.  కొంత మంది సెలబ్రెటీలకు సిగరెట్ అలవాటు ఉన్న విషయం తెలిసిందే.  ఎంత మంది చెప్పినా.. వారు మాత్రం ఆ అలవాటును మాత్రం మానుకోలేదరు.  ఇక బాలీవుడ్ లో షారూఖ్ ఖాన్ కి కూసింత ఎక్కువే.  

 

ఆయన్ని చైన్ స్మోకర్ అని అంటారు. నిన్న నటి కిషోరి బల్లాల్ కన్నుమూతపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో షారుఖ్‌ ఖాన్‌ ఒక ఆసక్తికర విషయం వెల్లడించారు.  నను ఓ సీనియర్‌ నటి పొగతాగడం మంచిది కాదని.. అలాంటి దురలవాట్లను వెంటనే మానేయాలని గట్టిగా మందలించేదని గుర్తు చేసుకున్నారు. స్వదేశ్‌ సినిమాలో షారుఖ్‌ ఖాన్‌కు ఆమె తల్లిగా నటించారు. ఆమె మృతి చెందిన నేపథ్యంలో ఆ నటితో కలిసి పనిచేసిన రోజులను షారుఖ్‌ గుర్తు చేసుకన్నాడు. అప్పట్లో నేను ఎక్కువగా సిగరేట్స్ తాగేవాడినని.. కిషోరీ అమ్మ నిన్ను మిస్ అవుతున్నా..  తాగవద్దు అని ఆమె చేసే మందలింపును కచ్చితంగా మిస్‌ అవుతున్నా అన్నారు.

 

కాగా,  1960లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కిషోరీ బల్లాల్‌ 75కు పైగా సినిమాల్లో కనిపించారు. బాలీవుడ్ లో అశుతోష్‌ గౌరికర్ ‘స్వదేశ్‌’ ఫిల్మ్ లో షారూఖ్‌ తల్లి పాత్రలో కావేరి అమ్మగా అందరినీ ఆకట్టుకుంది. రాణీ ముఖర్జీ ‘ఆయియా’, దీపికా పడుకొనే లఫంగే పరిందే సినిమాల్లోనూ నటించారు. భరతనాట్యం డ్యాన్సర్ శ్రీపతి బల్లాల్ ను పెళ్లి చేసుకున్నారు. కిషోరి బల్లాల్ కన్నుమూతపై పలు సినీ పరిశ్రమలో కన్నీరు పెట్టుకున్నారు.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: