కమల్ హాసన్,
శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం
ఇండియన్ 2. ఈసినిమా కోసం భారీ సెట్ ను వేస్తున్న క్రమంలో నిన్న రాత్రి 9:30గంటల ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది.సెట్ లో ఏర్పాటు చేసిన భారీ క్రేన్ 150 అడుగుల ఎత్తునుండి కింద పడడంతో ఈప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా 9మందికి గాయాలయ్యాయి. క్షతగ్రాత్రులను సమీపాన వున్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈప్రమాదం లో
కృష్ణ (అసిస్టెంట్ డైరెక్టర్),
చంద్రన్ (ఆర్ట్ అసిస్టెంట్),మధు (ప్రొడక్షన్ అసిస్టెంట్) లు మృతి చెందినట్లు చిత్ర నిర్మాణ సంస్థ
లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. వారి మృతికి చింతిస్తున్నామని వారి కుటుంభాలను అన్ని విధాల ఆదుకుంటామని లైకా తెలిపింది.
ఇక ప్రమాద సమయంలో డైరెక్టర్
శంకర్ కూడా అక్కడే వున్నాడని ప్రమాదంలో ఆయనకూడా గాయపడ్డారని ఆయన కాలు ఫ్రాక్చ్చర్ అయ్యినట్లు వార్తలువచ్చాయి అయితే ఇందులో నిజం లేదని తెలుస్తుంది. ప్రమాదానికి కొద్దీ గంటల ముందే
శంకర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడట.
ఇదిలావుంటే గత ఏడాది సమ్మర్ లోనే ఈ సినిమా లాంచ్ కాగా ఆతరువాతసెట్స్ మీదకు తీసుకెళ్లడానికి చాలా సమయం పట్టింది. మధ్యలో ఈసినిమా ఆగిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే కొన్ని నెలలుగా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుతూ రూమర్లన్నింటికీ చెక్ చెప్పగా ఇంతలో ఇలా జరగడం తో చిత్ర బృదం దిగ్బ్రాంతికి గురైయింది.