గ్రేట్ డైరెక్టర్‌ శంకర్, యూనివర్సల్‌ హీరో కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం భారతీయుడు 2. ప్రస్తుతం చెన్నైలోని ఓ స్టూడియోలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా  షూటింగ్ లో నిన్న రాత్రి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. చెన్నై లో జరిగిన ఘటనలో ఇద్దరు సహాయక దర్శకులు, మరొక స్టాఫ్ మెంబర్ అక్కడిక్కడే మృతి చెందగా దాదాపు పది మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ అనూహ్య సంఘటనతో సెట్ ఉన్నవారంత షాక్‌ అయ్యారు.

 

భారీ క్రేయిన్ అనుకోకుండా విరిగిపడటంతో ప్రమాదం జరిగింది. అయితే ఘటనపై కథానాయకుడు కమల్ హాసన్ స్పందించారు. `ఈ ఘటన అత్యంత భయంకరమైంది. నా తోటి మిత్రులను కోల్పోవడం చాలా బాధను కలిగిస్తోంది. మరణించిన వారి కుటుంబ సభ్యులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స అందుతోంది వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా` అంటూ ట్వీట్ చేశారు. `దురదృష్టవశాత్తూ బుధవారం (19 ఫిబ్రవరి 2020) రాత్రి 'ఇండియన్ 2' సెట్స్ లో ప్రమాదం సంభవించింది. దీని పట్ల తీవ్రంగా చింతిస్తున్నాము. ఈ ప్రమాదంలో హార్ట్ వర్కింగ్ టెక్నీషియన్స్ ముగ్గురిని మేం కోల్పోయాము. సహాయ దర్శకుడు కృష్ణ, ఆర్ట్ అసిస్టెంట్ చంద్రన్, ప్రొడక్షన్ అసిస్టెంట్ మధు మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం` అంటూ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

 

ఇకపోతే డైరెక్టర్ శంకర్ కి కూడా ఘటన లో పలు గాయాలయినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా శంకర్ దగ్గర పర్సనల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న మధు(29), కృష్ణ(34) తీవ్ర గాయాలతో షూటింగ్ స్పాట్ లోనే మరణించడం అందరిని షాక్ కి గురి చేసింది. ఇక స్టాపర్ గా ఉన్న 60 ఏళ్ల చంద్రన్... కూడా ఘటనలో మృతి చెందారు. ప్రస్తుతం కోలీవుడ్ లోనే కాకుండా దేశమంతా ఈ యాక్సిడెంట్ అందరిని షాక్ కి గురి చేసింది. ఘటన సమయంలో కమల్ హాసన్ షూటింగ్ స్పాట్ కి కొద్దీ దూరంలో ఉన్నారు. ఈ ప్రమాదంలో హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్ కూడా వెంట్రుక వాసిలో తప్పించుకుంది. మృతులకు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ సంతాపం తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: