సమంత.. తెలుగులో అగ్రతార.. అందంతోనూ.. నటనతోనూ మెప్పించిన తార. పెళ్లి తర్వాత చక్కటి అభినయం ఉన్న సినిమాలు ఎంచుకుని తానేంటో మరోసారి నిరూపించుకుంటోంది. ఇక నయన తార సంగతి చెప్పే పని లేదు. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దంన్నర దాటి పోయినా ఈ అమ్మడికి గిరాకీ తగ్గలేదు. అటు హీరోల పక్కన గ్లామర్ రోల్స్ చేస్తూనే.. మరోవైపు.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ అదరగొట్టేస్తోంది.

 

 

ఇక ఇప్పుడు ఈ అగ్రతారలిద్దరి మధ్య సమరం ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే.. వీరిద్దరూ కలిసి ఓ తమిళ సినిమాలో నటిస్తున్నారు. నయనతార ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తమిళ చిత్రం పేరు ‘కాత్తువక్కుల రెందు కాదల్‌’. ఇదో ట్రయాంగులర్ లవ్ స్టోరీ. ఈ మూవీలో హీరో విజయ్‌ సేతుపతి. విజయ్ సేతుపతి అంటేనే కథా ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో ఇరగతీస్తుంటాడు.

 

 

ఇక ఇప్పుడు అతడికి ఈ ఇద్దరు సీనియర్ ముద్దుగుమ్మలు పోటీ ఇస్తున్నారు. మొత్తం మీద నటనాదిగ్గజాలుగా పేరున్న ఈ ముగ్గురూ నటిస్తున్న సినిమాపై ఇప్పుడు అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా గురించి మాట్లాడిన సమంత.. ఈ కథ తనకెంతగానో నచ్చిందంటోంది. నయనతార, విజయ్‌ సేతుపతితో కలసి నటించడం ఛాలెంజింగ్ ఉందంటోంది. అందుకే ఈ కథకు ఓకే చెప్పానంటోంది సమంత.

 

 

రొటీన్ కథల గురించి కాకుండా.. ఆసక్తికరమైన, విభిన్నమైన కథల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ‘కాత్తువక్కుల రెండు కాదల్‌’ సినిమా ఆఫర్‌ తన దగ్గరికి వచ్చిందంటోంది సమంత. ఇప్పడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. అనిరుధ్‌ స్వరాలను అందించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: