ఈ మద్య ఓ చిత్రం మొదలు పెట్టినప్పటి నుంచి థియేటర్లో బొమ్మ పడే వరకు ఎన్నో టెన్షన్స్ నెలకొంటున్నాయి.  కథ కాపీ, సాంగ్స్ కాపీ, వ్యూజువల్స్ లీక్, లొకేషన్ ఫోటోలు లీక్, స్టోరీ ఇదే అంటూ కథనాలు, టైటిల్ వివాదం.. అన్నీ అవరోధాలు దాటుకొని వెళ్లి థియేటర్లో పడ్డ గంటలోనే నెట్టింట్లో ప్రత్యేక్షం.  ఇలా ఒక్కో ఇబ్బందులు ఎదుర్కొంటూ హిట్, ఫ్లాప్ టాక్ తో మమా అనిపించుకుంటున్నాయి.  ఇక ఈ మద్య ఏ చిత్రం వచ్చినా దాని టైటిల్ విషయంలో ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నాయి.  ఆ మద్య బాలీవుడ్ లో పద్మావతి టైటిల్ మార్చి పద్మావత్ చేశారు.. గత ఏడాది హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గద్దలకొండ గణేష్’ మొదట వాల్మీకి గా రిలీజ్ చేయాలనుకున్నా.. టైటిల్ వివాదంతో చివర్లో మార్చారు. 

 

ఇక రాంగోపాల్ వర్మ తీసిన కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీ చివరికి అమ్మరాజ్యంలో కడప బిడ్డలుగా థియేటర్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.  తాజాగా ఇప్పుడు నితిన్ నటించిన భీష్మ మూవీ పై వివాదం నెలకొంది. తాజాగా ఈ చిత్రం టైటిల్‌ వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని.. హీరోని లవర్‌బోయ్‌గా చూపిస్తూ, ‘భీష్మ’ అని టైటిల్‌ పెట్టడం బాధాకరమని బీజేపీ ధార్మిక సెల్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చిత్ర నిర్మాతలు స్పందించి, టైటిల్ మార్చాలని.. లేకుంటే చిత్రం విడుదలను అడ్డుకుంటామన్నారు. అవసరమైతే టైటిల్ విషయంపై కోర్టుకు కూడా వెళ్తామని హెచ్చరిస్తున్నారు.  రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

 

ఫిబ్రవరి 21న దాదాపు 800 స్క్రీన్స్‌లో విడుదల కానుంది ఈ చిత్రం. అన్నీ సవ్యంగా సాగుతున్న సమయంలో భీష్మ చిత్రం లేనిపోని వివాదాలు వచ్చాయి.  ఆజన్మ బ్రహ్మచారి అయిన భీష్ముడి పేరును లవర్ బాయ్ పాత్రకు పెట్టడం సరికాదన్నారు. వెంటనే చిత్రం పేరును మార్చాలని, లేదంటే చిత్రాన్ని విడుదల కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామన్నారు. మరి ఈ మూవీ టైటిల్ అలా ఉంచుతారా.. చివరాకర్లో మారుస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: