యంగ్ హీరో నితిన్ ఇప్పుడు హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అ..ఆ సినిమాతో ఒక్క సారిగా సూప‌ర్ ఫామ్‌లోకి వ‌చ్చిన నితిన్ ఆ త‌ర్వాత వ‌రుస‌గా ప్లాపుల‌తో కొట్టు మిట్టాడుతున్నాడు. నితిన్ చివ‌రి మూడు సినిమాలు ప్లాపులుగా మిగలడంతో నితిన్ ఈసారి హిట్ కొట్టడం తప్పనిసరి. భీష్మ హిట్ అయితేనే నితిన్ మార్కెట్ స్ట్రాంగ్ అవుతుంది. లేక‌పోతే నితిన్ మార్కెట్ మ‌రింత ప‌డిపోవ‌డం ఖాయం. ఛ‌లో లాంటి మంచి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల‌, ర‌ష్మిక మంద‌న్న లాంటి క్రేజీ హీరోయిన్ ఉండ‌డంతో భీష్మ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి.



సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూస్తుంటే ఈ సినిమాతో నితిన్ హిట్ అందుకునేలానే ఉన్నాడు. అన్నీ చాలా ప్రామిసింగ్ గా ఉండడంతో హిట్ కళ కనిపిస్తోంది. ఫిబ్రవరి 21న ఈ చిత్రం విడుదలవుతుండగా సినిమాపై బజ్, అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ కూడా పాజిటివ్ గా ఉన్నాయి. ఇక ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 23. 50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది.



సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాత దాదాపు 10 కోట్ల మేర లాభాల్ని చూశాడు. భీష్మ రు. 24 కోట్లకు పైన వసూలు చేస్తేనే హిట్ అని పరిగణించగలం. అదే రు. 30 కోట్లు వ‌స్తే సూప‌ర్ హిట్‌... అదే రు.40 కోట్ల షేర్ వ‌స్తే భీష్మ‌ను బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనాల్సిందే. చూడాలి మ‌రి నితిన్ ఈ సినిమాతో అయినా హిట్ కొడ‌తాడో ?  లేదో ?

భీష్మ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్ :

నైజాం : రు. 6.30 కోట్లు

సీడెడ్ : రు. 3.06 కోట్లు

ఉత్తరాంధ్ర : రు. 1.85 కోట్లు

గుంటూరు : రు. 1.55 కోట్లు

ఈస్ట్ :  రు. 1.55 కోట్లు

కృష్ణ :  రు. 1.40 కోట్లు

వెస్ట్ :  రు. 1.20 కోట్లు

నెల్లూరు : రు. 0.64 ల‌క్ష‌లు
----------------------------------------------
ఆంధ్ర + తెలంగాణ :  రు. 17.50 కోట్లు
-----------------------------------------------

రెస్ట్ ఆఫ్ ఇండియా :  రు. 2  కోట్లు

ఓవర్సీస్ :  రు. 2.40 కోట్లు

వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ :  రు. 23.50 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి: