మూడేళ్ళ క్రితం సోగ్గాడే చిన్న నాయన చిత్రంలో నాగార్జున చేసిన బంగారు రాజు పాత్ర‌లో క‌నిపించిన విష‌యం తెలిసిందే. అయితే అప్ప‌ట్లోనే ఆయ‌న ఆ పాత్ర‌తో తిరిగి మ‌ళ్ళీ ఆయ‌న సినిమా తీయాల‌నుకున్నారు. ఇక ఈ చిత్రాన్ని కూడా క‌ళ్యాణ్‌కృష్ణ‌తో  సీక్వెల్ తీయ‌డానికి ప్లాన్ చేశాడు నాగ్. దాదాపు సంవ‌త్స‌రం పాటు స్క్రిప్ట్ వర్క్ జ‌రిగింది. కానీ ఎందుకో అంత‌గా వ‌ర్క్ అవుట్ కాలేదు. 

 

బంగార్రాజు చిత్రం షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది అంటూ ఇప్ప‌టికే మీడియాలో చాలా క‌థ‌నాలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఈ మ‌ధ్య మాత్రం అలాంటి వార్త‌లు ఏమీ వినిపించ‌డం లేదు. ప్రస్తుతం వైల్డ్‌ డాగ్‌ చిత్రంలో నటిస్తున్న నాగార్జున అది పూర్తి కాకుండానే బంగార్రాజును చేస్తాడని అంతా అనుకున్నారు. చాలా మంది నాగార్జున బంగార్రాజు చిత్రాన్ని ఎందుకో సెంటిమెంట్‌గా ఫీల‌యిన‌ట్లు టాక్ కూడా వ‌చ్చింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్ర‌కారం బంగార్రాజు చిత్రం ఇప్పట్లో ప్రారంభం అయ్యేలా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. 

 

ఈ చిత్రం పై ఎంత పెద్ద ఎత్తు అంచ‌నాలున్న‌ప్ప‌టికీ అస‌లు ఈ చిత్రం వ‌స్తదా అన్న అనుమానాలు కూడా మ‌రో వైపు ఫ్యాన్స్‌కి వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రం కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. నాగార్జున మాత్రం ఈ చిత్రాన్ని ఎందుకో పెండింగ్ పెట్టుకుంటూ వ‌స్తున్నారు.

 

ఇక ఈ చిత్రంలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా ఉంటాడని ప్రచారం జరగడంతో అంచనాలు అమాంతం పెరిగాయి. ఒకే స్క్రీన్ మీద తండ్రికొడుకుల‌ను చూపించ‌డం అనేది ద‌ర్శ‌కుడికి క‌త్తిమీద సాములాగా మారింది. మ‌రి దీనికోసం ద‌ర్శ‌కుడు మ‌రింత ఎక్కువ జాగ్ర‌త్త‌లు పాటించాల్సి వ‌స్తుంది కాబ‌ట్టి కొంత టైం ప‌డుతుంద‌న్న వార్త‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: