ఈ రోజుల్లో టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ యూత్ ఎంటర్టైన్మెంట్ సినిమాలలో అన్ని రకాల పాత్రలను బ్రహ్మాండంగా పోషిస్తూ తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నారు. ప్రస్తుతం తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉందని చెప్పుకోవచ్చు. నితిన్, రష్మిక మందాన కాంబినేషన్ లో ఫిబ్రవరి 21న రిలీజ్ అవుతున్న భీష్మ సినిమాలో కూడా ఇతడు ఒక మంచి పాత్రను పోషించాడు. అయితే వెంకీ కుడుముల దర్శకత్వం లో రేపు విడుదల కాబోతున్న భీష్మ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంటును 2 రోజుల క్రితం చిత్ర యూనిట్ నిర్వహించారు.

 

భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంటులో బ్రహ్మాజీ కూడా పాల్గొన్నారు. అలాగే ఒక అయిదు నిమిషాల పాటు మాట్లాడారు. కానీ అతడు తన స్పీచ్ ని ప్రారంభించగానే హీరో నితిన్, త్రివిక్రమ్ శ్రీనివాస్, రష్మిక మందాన చాలా డిసప్పాయింట్ అయ్యారు. అలాగే రష్మిక గురించి (కుక్క బిస్కెట్స్) ఒక ప్రస్తావన తెచ్చి ఆమె బాధపడేలాగా చేశారు. ఏదేమైనా అతను మాట్లాడిన మాటలు, ప్రవర్తన చాలా నొప్పించే విధంగా ఉందని పలువురు సినీ ప్రముఖులు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా భీష్మ నిర్మాత అతడి మాటల పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట.



ఇంతకీ బ్రహ్మాజీ అంత తప్పుగా మాట్లాడిన వ్యాఖ్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. భీష్మ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరించిన సుమ బ్రహ్మాజీని స్టేజ్ పైకి పిలిచి మాట్లాడమని కోరుతుంది. దీంతో కాస్త ఓవరాక్షన్ చేస్తూ బ్రహ్మాజీ స్టేజ్ పైకి వచ్చి మార్చి 6వ తేదీన 'ఓ పిట్ట కథ' మూవీ రిలీజ్ కాబోతుంది అందరూ తప్పకుండా చూడాలి అని ఉద్దేశపూర్వకంగా అంటాడు. దీంతో కార్యక్రమానికి హాజరైన సినీ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అవుతారు. తెల్లమొహం వేసిన వారందరినీ చూసిన తర్వాత బ్రహ్మాజీ తన స్పీచ్ ని కొనసాగిస్తూ... 'ఓహ్, సారీ.. ఈ మధ్య ప్రమోషన్లు బిజీలో ఉండి అలవాటైపోయి చెప్పేసాను', అని నాలుక కరుచుకుని భీష్మ సినిమాలో తను ఒక చిన్న క్యారెక్టర్ చేశాడని చెప్పుకొస్తాడు.



బ్రహ్మాజీ ఆయన కుమారుడు సంజయ్ నటించిన ఓ పిట్ట కథ సినిమా గురించి చెప్పాలనుకుంటే తన స్పీచ్ చివరిలో చెప్పుకోవచ్చు. కానీ ఇలా ముందు ముందే ఓ పిట్ట కథ అంటూ మాట్లాడడం సరికాదని భీష్మ చిత్ర యూనిట్ మండిపడుతున్నారట. అనుమతి తీసుకొని ఓ నిమిషం పాటు తన కుమారుడి చిత్రం గురించి మాట్లాడితే మేము అభ్యంతరం చెప్పే వాళ్ళం కాదని అంటున్నారట. ఏదేమైనా భీష్మ సినిమా ప్రమోషన్స్ కి వచ్చి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిత్రబృందం. 

మరింత సమాచారం తెలుసుకోండి: