యువ హీరో నాగ శౌర్య డైరెక్టర్ వెంకీ కుడుముల ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఛలో. నాగ శౌర్య సొంత బ్యానర్ లో నిర్మించిన మూవీ మంచి హిట్ గా నిలిచింది. ఆ సినిమాతోనే రష్మిక టాలీవుడ్ కు పరిచయమైంది. నాగ శౌర్య ఖాతాలో మంచి హిట్ గా నిలిచింది ఛలో. ప్రస్తుతం ఆ డైరెక్టర్ నితిన్ తో భీష్మ సినిమా చేశాడు. తన సెకండ్ మూవీలో కూడా రష్మికనే హీరోయిన్ గా తీసుకున్నాడు. నాగ శౌర్య రీసెంట్ గా రిలీజైన అశ్వద్ధామ ప్రమోషన్స్ లో ఛలో డైరెక్టర్ వెంకీ కుడుముల మీద చాలా సీరియస్ అయ్యాడు. 

 

వెంకీ తనని మోసం చేశాడని.. అతనికి ఛలో లాంటి హిట్ ఇచ్చినా సరే ఆ కృతజ్ఞత లేదని.. మళ్ళీ వెంకీ వచ్చి అవకాశం ఇవ్వమని అడిగినా తనతో ఇక కలిసి పనిచేసేది లేదని అన్నాడు నాగ శౌర్య. అయితే నాగ శౌర్య చేసిన కామెంట్స్ కు వెంకీ కుడుముల పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. ఛలో సినిమాకు ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్ళకి ఇచ్చానని.. నాగ శౌర్య చేసిన కామెంట్స్ గురించి పెద్దగా స్పందించ లేదు వెంకీ. 

 

ఇక కొన్నిటి గురించి మాట్లాడకుండా ఉంటేనే మంచిదని నాగ శౌర్య కామెంట్స్ పై వెంకి చెప్పడం జరిగింది. అయితే ఛలో సినిమా తన వల్లే హిట్ అయినట్టుగా చెప్పుకుంటున్న నాగ శౌర్యకి భీష్మ రిజల్ట్ తర్వాత వెంకీ ఆన్సర్ ఇస్తాడని తెలుస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్నా భీష్మ సినిమా హిట్ అయినా తర్వాత నాగ శౌర్య చేసిన వ్యాఖ్యలపై స్పందించే అవకాశం ఉంటుంది. వెంకీ డైరెక్షన్ లో వస్తున్న ఛలో సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ సినిమాపై చిత్రయూనిట్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: