సినిమా పూర్తి కాగానే మరో సినిమా లైన్లో పెడుతూంటారు మన హీరోలు. స్టార్ హీరోలు మహేశ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్.. వీళ్లందరి సినిమాలు కొన్ని షూటింగుల్లో ఉంటే మరికొన్ని త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నాయి. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ బిజీలో ఉన్నారు ఎన్టీఆర్రామ్ చరణ్. కానీ వీరిద్దరిలో ఎన్టీఆర్ మంచి స్పీడ్ మీద ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత చేయబోయే ప్రాజెక్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. పైగా 2021 వేసవికి విడుదల అని డేట్ కూడా అనౌన్స్ చేసేశాడు.

 

 

త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోయే ఆ సినిమాకు ‘’అయిననూ పోయి రావలె హస్తినకు..’ అనే టైటిల్ అనుకుంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ అదే ఆర్ఆర్ఆర్ లో మరో హీరోగా నటిస్తున్న రామ్ చరణ్ మాత్రం ఈ విషయంలో చాలా లేట్ గా ఉన్నాడనే చెప్పాలి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న తన 152 సినిమాలో చరణ్ ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడనే వార్త తప్ప ఇంతవరకూ తన నెక్స్ట్ సినిమాపై ఎటువంటి క్లారిటీ లేదు. చరణ్ తో సినిమా చేయబోతున్నారంటూ ఎందరో దర్శకుల పేర్లు రౌండ్ అవుతున్నప్పటికీ ఎటువంటి క్లారిటీ లేదు. ఇది మెగా ఫ్యాన్స్ ను కలవరపెడుతోందనే చెప్పాలి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ షూటింగ్ 70శాతం పూర్తైందని ఎప్పుడో ప్రకటించారు. ఇప్పటి నుంచే ఓ క్లారిటీ లేకపోతే తర్వాతి సినిమా ఆలస్యమయ్యే అవకాశాలు లేకపోలేదు.

 

 

మెగా ఫ్యాన్స్ ఇదే విషయాన్ని తమ హీరో గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కు సంబంధించి చరణ్ విషయంలో ఏ అప్డేట్ లేదని బాధపడుతున్నారు మెగా ఫ్యాన్స్. ఇప్పుడు చరణ్ తన తర్వాతి సినిమా విషయంలో కూడా క్లారిటీ ఇవ్వకపోవటం వారిని నిరాశపరుస్తోంది. మరి చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: