ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌. ఎస్‌. రాజమౌళికి మెగా ఫ్యాన్స్ చుక్కలు చూపించడం ఏమిటి ? చూపిస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్, చరణ్ ఫ్యాన్స్ కలిపి చూపించాల‌నుకుంటున్నారా ?  పైన హెడ్డింగ్ నిజ‌మే. రాజ‌మౌళికి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో చుక్కలు చూపించేస్తున్నార‌ట‌. అదే టైంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం రాజ‌మౌళి విష‌యంలో ఫుల్ ఖుషీగా ఉన్నార‌ట‌. టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ ఇద్ద‌రూ క‌లిసి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్.ఆర్.ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.



ఈ సినిమాను డీవీవీ ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. వ‌చ్చే యేడాది సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా జ‌న‌వ‌రి 8వ తేదీన రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ హిస్ట‌రీలోనే తిరుగులేని క్రేజీ కాంబినేష‌న్‌తో తెర‌కెక్కే ఈ సినిమాపై లెక్క‌కు మిక్కిలిగా అంచ‌నాలు ఉన్నాయి. ఇటీవ‌ల‌ ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర తాలూకు లుక్ తో పాటు ఓ వీడియో కూడా లీకై సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.



ఈ వీడియోలు ఎన్టీఆర్ కొమ‌రం భీం లుక్ చూసిన వారంద‌రు లుక్ అదిరిపోయింద‌ని అంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే పిచ్చ ఫిదా అవుతున్నారు. అయితే అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ లుక్ ఎలా ఉంటుంద‌న్న అంచ‌నాలు ఎవ్వ‌రికి అంద‌డం లేదు. అందుకే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అంద‌రూ రాజ‌మౌళి కావాల‌నే ఎన్టీఆర్ లుక్ లీక్ చేసి.. ఆ క్యారెక్ట‌ర్‌కు హైప్ తెస్తున్నారా ? అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫైర్ అవుతున్నారు. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్‌లో అంద‌రూ కాక‌పోయినా ఇప్పుడు కొంద‌రు రాజ‌మౌళిని టార్గెట్ చేస్తూ సినిమాలో త‌మ హీరో చ‌ర‌ణ్ క్యారెక్ట‌ర్‌ను ఎక్క‌డ డౌన్ చేస్తాడో ? అని సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: