బుల్లితెర యాంకర్ ప్రదీప్ హీరోగా మున్నా డైరెక్షన్ లో వస్తున్న సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? ఈ సినిమా ద్వారా అమృత అయ్యర్ హీరోయిన్ గా పరిచయం అవుతుంది. సినిమా నుండి వచ్చిన మొదటి సాంగ్ నీలి నీలి ఆకాశం సూపర్ హిట్ అయ్యింది. Aa సాంగ్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు. ప్రదీప్, అమృత అయ్యర్ ఇద్దరు ఆ సాంగ్ లో అదరగొట్టారు. సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. కొన్నాళ్ళుగా సరైన సక్సెస్ కు దూరంగా ఉన్న అనూప్ ఈ ఒక్క సాంగ్ తో మళ్ళీ తన సత్తా చాటాడు. 

 

కొత్త దర్శకుడు.. యాంకర్ ప్రదీప్ హీరోగా మొదటి ప్రయత్నం.. అయితే నీలి నీలి ఆకాశం సాంగ్ తో క్రేజ్ తెచ్చుకున్నారు. సినిమా రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా ఎనౌన్స్ చేయలేదు కాని ప్రమోషన్స్ మాత్రం బాగా చేస్తున్నారు. ఢీ యాంకర్ గా చేస్తున్న ప్రదీప్ తన సినిమా ప్రమోషన్ కోసం తన టీమ్ ని ఇన్వైట్ చేశాడు. డైరెక్టర్ మున్నా తో పాటుగా హీరోయిన్ అమృత కూడా షో కి వచ్చింది. ఇక షోలో భాగంగా ఢీ షోకి తాను పెద్ద ఫ్యాన్.. అందరికి ఈ షో ఎంటర్టైన్మెంట్ ఇస్తే నాకు మాత్రం హీరోని ఇచ్చింది. ఈ సినిమా అమ్మాయిలందరికి బాగా నచ్చుతుంది. సినిమాని వారు ఇష్టపడతారు. 

 

 

అమ్మాయిలకు నచ్చే ఈ సినిమాలో హీరోగా వారందరికీ నచ్చే ప్రదీప్ ను పెట్టమని అన్నారు డైరక్టర్ మున్నా. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?  సినిమాపై యూత్ దృష్టి పడేలా చేసుకున్న ఈ సాంగ్ నెట్ లో కూడా హల్ చల్ చేస్తుంది. ఈమధ్యనే సుధీర్ హీరోగా సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా చేశాడు. అయితే ప్రదీప్ లా కాకుండా రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ సినిమా అవడంతో సుధీర్ సినిమాను ఎవరు పట్టించుకోలేదు. మరి ప్రదీప్ సినిమా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. తను చేసే షోలతో స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ని అలరిస్తున్న ప్రదీప్.. హీరోగా ఎలాంటి సత్తా చాటుతాడో చూడాలి. స్మాల్ స్క్రీన్ పై తను చేసే అన్ని షోలకు చిత్రయూనిట్ ను తీసుకొచ్చి బాగా ప్రమోట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: