ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరో భాష వాళ్లు కొనడం.. రీమేక్ చేయడం సర్వ సాధారణమైన విషయం. అలాంటి సినిమాలు కొనడంలో సౌత్ ఇండస్ట్రీలో తెలుగు సినీ పరిశ్రమ టాప్ పొజిషన్ లో ఉంటుందనే చెప్పాలి. ఓ ఇద్దరు ముగ్గురు టాలీవుడ్ స్టార్ హీరోలు తప్ప టాలీవుడ్ లోని దాదాపు అందరు హీరోలు రీమేక్ లు చేసినవాళ్లే. ఇందులో రామ్ చరణ్ కూడా ఉన్నాడు. తను చేసిన ధృవ కూడా తమిళ రీమేక్ సినామానే. గతేడాది మళయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ తీసుకున్న విషయం తెలిసిందే.

 

 

అయితే.. చరణ్ మరో మళయాళ సినిమా డ్రైవింగ్ లైసెన్స్ రైట్స్ ను కొన్నాడని ఓ వార్త ఫిలింనగర్ లోనూ.. సోషల్ మీడియాలోనూ నాలుగు రోజుల క్రితం హోరెత్తింది. దీనిపై ఇప్పుడు మరో వార్త హల్ చల్ చేస్తోంది. అసలు రామ్ చరణ్ డ్రైవింగ్ లైసెన్స్ రైట్స్ కొనలేదని.. ఈ వార్తలో మాత్రం నిజం లేదనే వార్త షికారు చేస్తోంది. లూసిఫర్ ను కొన్న తాను డ్రైవింగ్ లైసెన్స్ కొనలేదని రామ్ చరణ్ తన సన్నిహితుల వద్ద అంటున్నాడట. నిజానికి ఈ సినిమా రైట్స్ కొన్నాడనే వార్త రాగానే చరణ్ కు రీమేక్ లు ఎందుకు అనే గుసగుసలు వినిపించాయి. కానీ ఆ రీమేక్ ను విక్టరీ వెంకటేశ్ తో తెరకెక్కిస్తున్నాడని మరో వార్త హల్ చల్ చేసింది.

 

 

ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ అలాంటి ప్రయత్నాలేమీ చేయలేదని తెలుస్తోంది. కానీ ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. లూసిఫర్ గురించే ఇంకా ఓ కొలిక్కి రాకుండా మరో మళయాళ రీమేక్ ఏంటనే చర్చకు దారితీసింది. దీనిపై మరింత క్లారీటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: