యంగ్ హీరో నితిన్.. టాలీవుడ్ బ్యూటీ క్వీన్ రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం భీష్మ. చలో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా  ఈ సినిమా మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన పాటలు ట్రైలర్ టీజర్ కు మంచి ఆదరణ లభించింది. ఇక ఈ సినిమా పాటలు అయితే సంచలన రికార్డు సృష్టించాయనే  చెప్పాలి. మొదటినుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్  ఏర్పడింది. దీంతో ఎంతో మంది ప్రేక్షకులు ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. 

 


 అంతేకాకుండా రష్మిక మందన సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావటంతో ... ఈ  సినిమాపై మరింత క్రేజ్ పెరిగిపోయింది. ఈ సినిమాలో రష్మిక నితిన్ జోడీ కూడా ఎవర్గ్రీన్ గా నిలిచే లా కనిపిస్తుంది ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో వీరిద్దరి కాంబినేషన్ బాగా సెట్ అయింది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఎంటర్టైనర్ సినిమాలు బాగా ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ విడుదలైన ఎంటర్టైన్మెంట్ సినిమాలు అన్నింటిని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇక ఇప్పుడు నితిన్ రష్మిక కాంబినేషన్లో రాబోతున్న భీష్మ సినిమా కూడా ఎంటర్టైన్మెంట్ కోవలోకి సంబంధించింది కావడంతో ఈ సినిమాపై నితిన్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. 

 


 ఇకపోతే తాజాగా చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేసింది. సినిమా చిత్రీకరణ సందర్భంగా తీసిన మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం . ఇక ఈ వీడియోలో  రష్మిక  చేసిన సందడి హైలెట్గా నిలిచింది. నితిన్ రష్మిక  సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి . సితార  ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశ నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి  ప్రేక్షకులను నితిన్  ఎంతవరకు అలరించబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమా విడుదల తర్వాత ఏ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా లేకపోవడంతో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: