అవును.. జూనియర్, సీనియర్ కి సవాలు విసిరాడు. టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి  విడుదల అవుతున్నాయి అంటే, ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. ప్రధానంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి బడా హీరోల సినిమాలకు కాస్త క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇద్దరి హీరోల సినిమాలు ఒక్కసారే రిలీజ్ ఉంటే మాత్రం ఇక ఇద్దరు హీరోల అభిమానులకు పండగ వాతావరణమే ఉంటుంది. అటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమాల మీద కాస్త ఆసక్తి ఎక్కువే అని చెప్పుకోవాలి.

 

మొన్న సంక్రాంతి బరిలో మహేష్ బాబు మరియు అల్లు అర్జున్ ఉన్నారు. అభిమానులు, మా హీరో నెగ్గుతాడు అంటే.. మా హీరో అని పందాలు కాశారు. కానీ ఇటు మహేష్ బాబు, అటు అల్లు అర్జున్ ఇద్దరు కూడా.. ఎవరికి వారు, వారి సత్తాని చాటుకున్నారు. సరిలేరు నీకెవ్వరు.. అలాగే, అల వైకుంఠపురములో సినిమాలు మంచి విజయాలను సాధించాయి. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ దుమ్ము లేపాయి. అలాగే వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు మరియు జూనియర్ ఎన్టీఆర్ పోటీబడబోతున్నారు.

 

వచ్చే సంక్రాంతికి, మహేష్ బాబు అండ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో సినిమా వస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా కావడం విశేషం. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో మహర్షి మంచి విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే. ఇప్పుడు వచ్చే ఈ సినిమాను, జేమ్స్ బాండ్ కథ ఆధారంగా ఎంచుకున్నారు. దీనిలో మహేష్ బాబు బాండ్ లాగా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి మొదలుకానుంది. 

 

అలాగే, వచ్చే సంక్రాంతికి ఎన్టీఆర్ సినిమా కూడా రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా రానుంది. ఇంతకుముందు కూడా వీరిద్దరి కాంబినేషన్ లో అరవింద సమేత సినిమా వచ్చి మంచి విజయం సాధించిన సంగతి విదితమే. ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్ లో "అయినను, పోయిరావలె… హస్తినకు!" అనే సినిమాను తీస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్ మే నుంచి మొదలు కానుందని టాలీవుడ్ తాజా సమాచారం. కాబట్టి, ఈసారి కూడా సంక్రాంతికి ఓ జూనియర్, సీనియర్ కి సవాలు విసరబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: