ఈ మధ్య కాలంలో ఎంతో మంది ప్రముఖుల జీవిత చరిత్రలు సినిమాలుగా మలిచి నేటి తరం ప్రేక్షకులకు దర్శకుడు పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే.  రాజకీయ ప్రముఖుల జీవిత చరిత్ర లనే కాదు... ఎంతో మంది ప్రముఖుల బయోపిక్ లను  కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో యోధుడు బయోపిక్ తెరకెక్కబోతున్నట్లు  సమాచారం. అఖండ హిందు  సామ్రాజ్యాధినేత   పేరు గడించిన మరాఠా యోధుడు మొగల్ పాలకుడు ఔరంగజేబు ను గడగడలాడించిన వీరుడు... జాతి కులం అనే బేధాలు లేకుండా పాలన సాగించిన గొప్ప యోధుడు... చత్రపతి శివాజీ జీవిత చరిత్రను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. నిన్న శివాజీ జయంతి సందర్భంగా శివాజీ జీవిత కథ ఆధారంగా మూడు భాగాలుగా సినిమాను తెరకెక్కించబోతున్నట్లు  ప్రకటించారు ప్రముఖ బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్.

 


 ఇక ఈ సినిమాని మరాఠీ చిత్రం సైరత్ చిత్రం ఫేమ్  నాగరాజ్  మంజులే  దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ బాలీవుడ్ చిత్రానికి  అజయ్ అకుల్  సంగీతం అందించనున్నారు. కాగా  సినిమా మొదటి భాగానికి శివాజీ రెండవ భాగానికి రాజా శివాజీ.. మూడో భాగం కి చత్రపతి శివాజీ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా ఈ చిత్రం మూడు భాగాలు కొన్ని నెలలు గ్యాప్ లోనే విడుదల కానున్నట్లు ప్రకటించారు. అయితే శివాజీ జయంతి సందర్భంగా ఈ చిత్రం గురించి ప్రకటన చేయడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ చిత్ర బృందం తెలిపింది. 

 


 ఇప్పుడు వరకు ఎంతోమంది జీవిత చరిత్రలు తెరమీదికి వచ్చినప్పటికీ... ఛత్రపతి శివాజీ కి సంబంధించిన జీవిత చరిత్ర మాత్రం ఇప్పటివరకు ఎవరు తెరకెక్కించలేదు. కాగా తానాజీ సినిమాలో  కొన్ని సీన్లు  చత్రపతి శివాజీ మహారాజు కు ప్రాధాన్యం ఉన్న పూర్తిస్థాయిలో... ఆయన జీవిత చరిత్ర మాత్రం తెరకెక్కించ లేదు. కాగా మొత్తానికి హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పి... ఇప్పుడికి హిందువులచే  కొలువబడుతున్న శివాజీ మహారాజు జీవిత చరిత్రను తిరుపతి సినిమా పాటలు సినిమా ప్రకటించడంతో... ఎంతో మంది హిందువులు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: