స్టార్ హీరోయిన్ చేతిలో ఎప్పుడూ రెండు, మూడు సినిమాలుంటాయి. మరో ఛాన్స్ వస్తే డేట్స్.. ఎడ్జెస్ట్ చేయలేక వదిలేసుకునే పరిస్థితి. అయితే  ఓ స్టార్ హీరోయిన్ కెరీర్ ఇందుకు రివర్స్ లో నడుస్తోంది. స్టార్ హీరోయిన్ అన్న పేరేగానీ.. తెలుగులో ఒక్క సినిమా చేయడం లేదు. 

 

పెళ్లి తర్వాత సమంత తన మైండ్ సెట్ మార్చుకుంది. కథ.. క్యారెక్టర్ నచ్చితేనే గానీ సినిమాకు సైన్ చేయాలన్న డెసిషన్ తీసుకోవడంలో గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ కాస్తా పెరిగిపోయింది. మరోవైపు స్టార్ హీరోలైతే.. ఈ అమ్మడిని పట్టించుకోకపోయినా.. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ పై ఫోకస్ పెట్టింది సామ్.

 

ఆ మధ్య రిలీజైన జానుపై సమంత చాలా ఆశలు పెట్టుకుంది. సమంత, శర్వానంద్ పెర్ఫామెన్స్ కు మంచి మార్కులే పడినా.. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. మంచి వసూళ్లు రాబట్టలేకపోయింది. జాను తర్వాత సమంత నటించే తెలుగు సినిమా అంటే ఒక్కటీ కనిపించడం లేదు. 

 

సమంత ప్రస్తుతం తమిళంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో కాతు వాకుల కాదల్ సినిమాలో నటిస్తోంది. ఈ ఒక్కటి మినహా మరో మూవీ చేతిలో లేదు. అమ్మ అవ్వాలనుకుంటున్న సామ్.. సినిమాలు తగ్గించేసుకుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

 

మొత్తానికి సమంత పెళ్లి తర్వాత తెగ ఊపులో సినిమాలు చేస్తున్నా.. రానురాను సినిమాలు తగ్గించేస్తున్న టాక్ వినిపిస్తోంది. సమంత మాత్రం ఇప్పటికే ప్రకటించింది.. రెండేళ్ల తర్వాత సినిమాలు మానేసి.. ఎంచక్కా ఫ్యామిలీతో గడపాలని డిసైడ్ అయిందని చెప్పకనే చెప్పింది. కానీ అంతకంటే ముందే ఎన్నో గాసిప్స్ టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. తెలుగులో సినిమాలు తగ్గించి.. ఇతర సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్న సామ్.. మూవీస్ తగ్గించేస్తుందనే వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం తనకు తల్లి కావాలనే ఆరాటంతోనే ఈ విధంగా చేస్తుందనే గాసిప్స్ వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: