టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన వరల్డ్ ఫేమస్ ల‌వర్ గత శుక్రవారం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో విజయ్ నటించిన అర్జున్ రెడ్డి - గీత గోవిందం - పెళ్లిచూపులు లాంటి సినిమాలు సూపర్ హిట్ అవడంతో పాటు ఆ సినిమాలకు 50 కోట్ల పైచిలుకు షేర్ రావడంతో విజయ్ క్రేజ్ రెండు తెలుగు రాష్ట్రాల తోపాటు... ఓవర్సీస్లో ఒక రేంజ్ కు వెళ్లిపోయింది. కెరీర్‌ స్టార్టింగ్ లోనే విజయ్ సినిమాలు సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో అత‌డి ప్రవర్తనలో మార్పు వచ్చిందని ప్రచారం కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది అక్కడి నుంచి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ పెరిగిపోయారు అదే తరహాలో యాంటీ ఫ్యాన్స్ కూడా బాగా పెరిగిపోయారు.



ఇవ‌న్నీ ఇలా ఉంటే సినిమా సినిమాకు విజ‌య్ క్రేజ్ త‌గ్గిపోతుంద‌ని కూడా అత‌డి సినిమాల‌కు వ‌చ్చిన క‌లెక్ష‌న్లే చెపుతున్నాయి. తాజాగా వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమా రిజల్ట్ అలా ఉంటే.. విజయ్ మార్కెట్ ఎంత తగ్గిందో అనేదానికి ఈ సినిమా ఒక ఉదాహరణగా నిలుస్తోంది.  గీత గోవిందం సినిమాకు 70 కోట్లకు పైగా షేర్ వచ్చింది. ఈ సినిమాకు గ్రాస్ అయితే ఏకంగా రు.110 కోట్ల వ‌ర‌కు వెళ్ల‌డంతో అప్ప‌ట్లో స్టార్ హీరోలు సైతం షాక్ అయ్యారు. విజ‌య్ కెరీర్‌లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్.



ఇక డియ‌ర్ కామ్రేడ్ ప్లాప్ అయినా ఫ‌స్ట్ డే రు.10 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇప్పుడు వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ అయితే ఫుల్ ర‌న్‌లో కూడా రు.10 కోట్ల షేర్ రాబ‌డుతుందా ? అన్న సందేహాలు క‌లుగుతున్నాయి. డియ‌ర్ కామ్రేడ్ ప్లాప్ అయినా ఫ‌స్ట్ డే రు. 10 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఫుల్ ర‌న్‌లో రు. 10 కోట్లు కూడా వ‌చ్చే ప‌రిస్థితి లేదంటే విజ‌య్ మార్కెట్ ఎంత డౌన్ అయ్యిందో అర్థ‌మ‌వుతోంది. స్టార్ హీరో అంటే హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా మినిమమ్ కలెక్షన్స్ తీసుకురావాలి. దీనిని బ‌ట్టి చూస్తే విజ‌య్ మార్కెట్ ఇంకా స్టెబుల్ కాలేద‌ని అర్థ‌మ‌వుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: