ఈ మద్య టాలీవుడ్ లో వరుసగా చిన్న సినిమాల జోరు పెరిగిపోతుంది.  కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలైనా పెద్ద సినిమా స్థాయిలో కలెక్షన్లు వసూళ్లు చేస్తున్నాయి.  రేపు శివరాత్రి కానుకగా టాలీవుడ్ లో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్న విసయం తెలిసిందే.  నితిన్ నటించిన ‘భీష్మ’,  తోలేటి దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ మూవీ ‘కొలైయుత్తిర్‌ కాలం’. ఈ మూవీని తెలుగులో ‘వసంతకాలం’ పేరుతో విడుదల చేయనున్నారు.   ఈ రెండు సినిమాలో మరో చిన్న సినిమా పోటీ పడుతుంది.  శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాంటిది శివుడికి ఎంతో ఇష్టమైన రోజు ‘మహాశివరాత్రి’ పర్వదినాన మా సినిమా విడుదల చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అన్నారు నిర్మాత ఎస్.ఎన్. లక్ష్మీనారాయణ. మాగ్నమ్ ఓపస్   ఫిలిమ్స్ పతాకం‌పై శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు దర్శకత్వంలో ఎస్‌ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న సినిమా ‘చీమ - ప్రేమ మధ్యలో భామ’.  

 

మూవీ గురించి డైరెక్టర్ మాట్లాడుతూ...  చీమ హీరో కదా అని చిన్న పిల్లలకు ఈ సినిమా ప్రత్యేకం కాదు. అంతకుమించి సృష్టిలో స్త్రీ, పురుషుల సమానం. కాకపోతే పురుషులు కొంచెం ఎక్కువ సమానం అని ఒకప్పుడు ముళ్లపూడిగారు చెప్పారు.  ఈ సినిమా అందరి కోసం.. కాకపోతే స్త్రీ కోసం కొంచెం ఎక్కువ. అవునో, కాదో ప్రేక్షకులే నిర్ణయిస్తారు. అంతే కాదు ఈ మూవీలో గ్రాఫిక్ మాయాజాలం బాగానే ఉంటుంది.  అందరినీ బాగా ఆకర్షిస్తుందని ఆశిస్తున్నామన్నారు. నిర్మాత ఎస్‌ఎన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..  ఈనాటి యువతీయువకులు ప్రేమ విషయంలో ఎంత పరిణితితో ఉన్నారో తెలియచెప్పే చిత్రం ఇది. కాలం మారినా నిజమైన ప్రేమ స్వచ్ఛంగా అన్నిపరీక్షలకు అతీతంగానే ఉంటుందని తెలియజేసేందుకు మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం అన్నారు.

 

అమిత్, ఇందు, సుమన్, హరిత, పురంధర్, వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్, రవి కిషోర్, కిషోర్ రెడ్డి, వెంకటేశ్, సురేష్ పెరుగు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రవి వర్మ, సింగర్స్: ఎస్.పి. బాలసుబ్రమణ్యం, గీతా మాధురి; సినిమాటోగ్రఫీ: ఆరిఫ్ లలాని, ఎడిటర్: హరి శంకర్,కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పల రాజు
నిర్మాత: ఎస్.ఎన్ లక్ష్మీనారాయణ

మరింత సమాచారం తెలుసుకోండి: