గత కొంత కాలంగా టాలీవుడ్ లోకి వరుసగా బాలీవుడ్ బ్యూటీలు సందడి చేస్తున్నారు.  హీరోయిన్లుగానే కాదు ఐటమ్ సాంగ్స్ కి కూడా బాలీవుడ్ బ్యూటీల వెంటనే పడుతున్నారు దర్శక, నిర్మాతలు.  ఇప్పటి యంగ్ హీరోల సరసన ఎక్కువగా బాలీవుడ్ భామలనే సెట్ చేస్తున్నారు. రెమ్యూనరేషన్ ఎంతైనా లెక్కచేయకుండా కొత్తదనం కోసం .. ప్రేక్షకులు కోరుకునే గ్లామర్ ను అందించడం కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మలను రంగంలోకి దింపుతున్నారు.   మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో వరుణ్ తేజ్.  ముకుంద సినిమాతో తన ప్రస్థానం మొదలు పెట్టిన ఈ కుర్ర హీరో ఫిదా తర్వాత తొలిప్రమ తో మంచి హిట్ అందుకున్నాడు.  

 

గత ఏడాది వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 సూపర్ సక్సెస్ అయ్యింది.  ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దల కొండ గణేష్ సినిమాతో మరో విజయం అందుకున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో  కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఒక సినిమాచేస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాను అల్లు బాబీ,సందీప్ కలిసి నిర్మిస్తున్నారు.  ఈ మూవీతో మరో బాలీవుడ్ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం అవుతుంది..పేరు సయీ మంజ్రేకర్. ఈ అమ్మాయి ఎవరో కాదు.. బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ కూతురు. సల్మాన్ సరసన 'దబాంగ్ 3'లో నటించింది.

 

  ఈ నెల 24వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఇప్పటి వరకు బాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్స్ లో ఎక్కువ కాలం ఉన్నది మాత్రం ఒక్క రకూల్ ప్రీత్ సింగ్ మాత్రమే.  అయితే ఈ బ్యూటీకి కూడా మద్య తెలుగు లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి పయణం అయ్యింది.   మరి ఈ మూవీ వరుణ్ తేజ్, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ ఎంత వరకు సక్సెస్ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: